మంత్రి కొడాలి నాని కృషితో గుడివాడ-కంకిపాడు రోడ్డుకు మోక్షం

618

 రూ.16. 10 కోట్లతో రోడ్డు విస్తరణ, రివిట్ మెంట్ పనులు

గుడివాడ , ఫిబ్రవరి 20 : రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) కృషితో గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభించింది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డును నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను మంత్రి కొడాలి నాని తయారు చేయించి ప్రభుత్వానికి పంపారు . దీంతో రూ . 16. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయి .

గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ అంశం ఈనాటిది కాదు . గుడివాడ పట్టణ ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుకు ఇరువైపులా పంట , మురుగుకాల్వలు ఉం ! వల్ల ఎక్కడ చూసినా రోడ్డు కుంగిపోవడం , గోతులమయంగా తయారవడం వల్ల ఏళ్ళ తరబడి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి . 2004 వ సంవత్సరం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చిన మంత్రి కొడాలి నాని 15 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలోనే ఉండడంతో గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ గుడివాడ ప్రజలకు కలగానే మిగిలిపోయింది . గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం , నాల్గవసారి ఎమ్మెల్యేగా గెల్చిన కొడాలి నాని మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు .

దీనిలో భాగంగా గుడివాడ పట్టణంలోని పామర్రు రోడ్డులో ఉన్న పెదకాల్వ సెంటర్ నుండి కేటీఆర్ మహిళా కళాశాల , నలంద పాఠశాల , జీవీఆర్ కళ్యాణ మండపంల మీదుగా మందపాడు రైల్వేగేటు వరకు , అలాగే గుడివాడ – కంకిపాడు రోడ్డులో రైలు పేట నుండి మండల కేంద్రమైన పెదపారుపూడి అడ్డరోడ్డు వరకు 10 మీటర్ల వెడల్పున రోడ్డును నిర్మించనున్నారు . అంతేగాక ఈ రోడ్డుకు రైలుపేట నుండి పెదపారుపూడి అడ్డరోడ్డు వరకు కుడివైపున కాల్వ ఉంది . ఈ కాల్వకు రివిట్ మెంట్ పనులను కూడా చేపట్టనున్నారు . ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తిచేశారు . కొద్దిరోజుల్లో రోడ్డు విస్తరణ , రివిట్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు .

ఇప్పటికే రోడ్డు విస్తరణకు సంబంధించి అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించి అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఏపీఎస్ పీడీసీఎల్ ఎ ఈ ఆపరేషన్ ఎం శివప్రసాదరెడ్డిని మంత్రి కొడాలి నాని ఆదేశించారు . గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే గుడివాడ నుండి విజయవాడకు వెళ్ళే వాహనాల రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి .