రాష్ట్రంలో ఆటవిక పాలన

206

న్యాయవాద దంపతుల హంతకులను వదలొద్దు
ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణోత్ భద్రునాయక్

రాష్ట్రంలో టిఆర్ఎస్ ఆటవిక పాలన సాగుతోందని, న్యాయవాద దంపతుల హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదల కూడదని, అధికార మదమెక్కిన నాయకులు రాబందుల వలె వ్యవహరిస్తున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ తీవ్రంగా విమర్శించారు.శనివారం విడుదల చేసిన తన ప్రకటనలో ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ,ప్రభుత్వ పారదర్శకతను, పనితీరును ,సమర్థతన ఎద్దేవా చేసిందని, న్యాయ వ్యవస్థ అనేది లేకుంటే, టిఆర్ఎస్ నాయకులు మరింత బరితెగించి చేవారని ఆరోపించారు.

మంథని మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మేనల్లుడు దంపతుల హత్యలో ప్రత్యక్ష పాత్ర ఉందని కథనాలు వెలుగులోకి వస్తున్నాయని, ఇదే సమయంలో పెద్దపల్లి చైర్మన్ పాత్రపై కూడా వస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకునే తీరులో వ్యవహరించాలని సూచించారు. న్యాయవాద దంపతులను మిట్టమధ్యాహ్నం జనసందోహం మధ్య హత్య చేయడం వెనక ,తమదే ప్రభుత్వం పోలీసు తమవారే అనే ధైర్యం కనిపిస్తుందని ,ఆ తెగింపు వెనక అలాంటి ఆలోచన లేకుంటే వారా లా ,వ్యవహరించే వారు కాదని  విమర్శించారు. ఈ హత్యను సుమోటోగా తీసుకుని ,హైకోర్టు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి హితవులు వంటివనీ చెప్పారు .

రాష్ట్రంలో అనేక చోట్ల టిఆర్ఎస్ నాయకులు చాలామంది దుందుడుకు గా ప్రవర్తిస్తున్నారనే  వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి వాటిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చేతనే ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు .ముఖ్యమంత్రే స్వయంగా పలు సభలలో అసహనం ప్రదర్శిస్తూ ఉండగా, అదే దారిలో మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు, కూడా వెళుతున్న క్రమంలో  ఇతర నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇదే విధంగా కాకుండా ఏవిధంగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు .చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదనే సంకేతాలు ప్రభుత్వం పంపాలని ,అలా పరిస్థితులు లేవు అని హైకోర్టు స్వయంగా తన వ్యాఖ్యల ద్వారా చెప్పినట్లు ఉందన్నారు .ఏది ఏమైనా న్యాయవాద దంపతుల హంతకులను వెనుక నుంచి కాపాడే ప్రయత్నాలు చేయకుండా, తన రాజా ధర్మాన్ని ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ప్రజాస్వామిక విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవుపలికారు.