తెరాస కార్యకర్తలు ప్రజలతో మమేకం:పద్మారావు గౌడ్

553

సికింద్రాబాద్ : తెరాస కార్యకర్తలు నిత్యం ప్రజలతో సాన్నిహిత్యం  ఏర్పర్చుకొని వారి సమస్యల పరిష్కారానికి ముందంజలో ఉంటారని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా  అయన సోమవారం తార్నాక లో తెరాస సభ్యత్వాన్ని లాంచనంగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా  తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెరాస కార్యకర్తలే పార్టి కి బలమని, సికింద్రాబాద్ నియోజకవర్గం లో తెరాస కార్యకర్తల వల్లే తమ పార్టి  ఘన విజయాలు సాధిస్తోందని అన్నారు.  డిప్యూటీ మేయర్  మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు తెరాస నేత మోతే శోభన్ రెడ్డి,  యువ నేతలు  తీగుల్ల కిషోర్ కుమార్,  తీగుల్ల రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, తెరాస సికింద్రాబాద్ నియోజకవర్గ సమన్వయకర్తలు రాజా సుందర్, జలంధర్ రెడ్డి  తదితరులు  పాల్గొన్నారు.