హవ్వ..ఓటర్లకు శ్రీవారి లడ్లా?అపచారం!

447

చర్యకు లోకేష్ డిమాండ్

పంచాయితీ ఎన్నికల్లో తిరుమల శ్రీవారి లడ్లను ప్రచారంలో కలిపి పంపిణీ చేయడం ద్వారా, జగన్ సర్కారుకు శ్రీవారి ఆలయంపై ఎంత గౌరవ మర్యాదలున్నాయో స్పష్టమవుతోందని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. ఇది భక్తిని దుర్వినియోగం చేయడేమనన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అని విరుచుకుపడ్డారు. అని ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్డి మాండ్ చేశారు.  చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తొండ‌వాడ పంచాయ‌తీలో వైసీపీ నేత‌లు ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన శ్రీవారి ల‌డ్డూల‌ను ఓట్ల స్లిప్పుల‌తో క‌లిసి పంచుతూ స్వామివారికి మ‌హాప‌చారం త‌ల‌పెట్టారు.జ‌గ‌న్‌రెడ్డికి,వైసీపీ నేత‌ల‌కు ఎన్నిక‌ల‌పైనే కానీ, ఏడుకొండ‌ల‌వాడిపై భ‌క్తిలేదు  అన్నారు.

స‌న్నాసుల స‌న్న‌బియ్యం వ్యాన్ల‌లో ల‌డ్డూల‌ను త‌ర‌లించి ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించారు.  ఎస్సీల‌కు 5 లడ్లు, ఇత‌రుల‌కు 10 లెక్క‌ పంపిణీ చేసి కుల‌వివ‌క్ష చూపారు. ఓట్ల‌కు కోట్లు వెద‌జ‌ల్లుతున్నా ప‌ల్లెల్లో జ‌గ‌న్‌రెడ్డిని జ‌నం న‌మ్మ‌డంలేదు  అన్నారు.శ్రీవారి ల‌డ్డూలిస్తే భ‌క్తితోనైనా ఓటేస్తార‌ని వైకాపా నేతలు ప‌న్నిన‌కుతంత్రం ఇది. హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన ల‌డ్డూల‌ను ఓట‌ర్ల‌కు తాయిలాలుగా పంచిన అభ్య‌ర్థిని పోటీకి అన‌ర్హులుగా ప్ర‌క‌టించాలి  నారా లోకేష్ డిమాండ్ చేశారు.కొండ‌పై భ‌క్తుల‌కు ఒక ల‌డ్డూ దొర‌క‌ని ప‌రిస్థితిలో ఇన్ని వేల ల‌డ్డూలు త‌ర‌లించిన వైసీపీ నేత‌లు, వారికి అందించిన టిటిడి యంత్రాంగంపై చ‌ర్య‌లు చేప‌ట్టాలి.స్వామికి జ‌రిగిన అప‌చారం, వ్యాన్ల‌లో త‌ర‌లింపు, ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌, కుల‌వివ‌క్ష‌ల‌పై కేసులు న‌మోదు చేసి నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాం  అన్నారు.