పితృదోషము

551

తెలిసిగాని, తెలియక గాని పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన చెడు కర్మలు, తప్పిదములు.
ప్రస్తుతం వారసులు చేసే తప్పిదములకు తమ పితృదేవతల ఆత్మ ప్రశాంతంగా ఉండకపోవటం
పితృదేవతల కోరికలు నెరవేరకపోవటం ఆయుధముల వలన లేదా యాక్సిడెంట్ల వలన ఆకస్మిక అసహజ మరణం పొందిన వారసులకు పితృదోషం కలుగుతుంది.

వారసులు తమ పితృదేవతలకు శ్రార్ధ కర్మలు ఆచరించకపోవటం
కొందరికి పితృదోషము ఉన్నట్టుగా జన్మకుండలిలో కనిపించదు. ఆకస్మిక ప్రమాదాల వలన చనిపోయిన వారి తండ్రి తరపున 7 తరముల వరకు, తల్లి తరపున 4 తరముల వరకు ఈ పితృదోషం వెంటాడుతుంది.జన్మకుండలిలో రాహు కేతువులు పాప దృష్టి పొంది ఉన్నా, పితృ స్థానం శత్రుస్థానం అయినా, పితృ దోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. హైందవ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు కేతువుల వలన కలిగే పితృశాపమునకు రాహు ఎత్తువ్లా శాంతి, ప్రీతి హోమముల ద్వారా కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పవచ్చు.

భారతీయ సంఖ్యాశాస్త్రములో కూడా ఈ పితృదోషమునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక కుటుంబము తరచూ ఊహించని సమస్యలు ఎదుర్కోవడం లేదా భార్యా భర్తలకు పిల్లలు కలుగకపోవటం లేదా ఒకవేళ కలిగినా ఆరోగ్యంగా ఉండటకపోవటం లేదా మానసిక, శారీరక లోపాలతో జన్మించటం ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవి కూడా “పితృదోషం” వలననే అని గుర్తించాలి. ఇక్కడ చెప్పిన సమస్యలకు సంతానదోషం, సర్పశాపం…… ఇలా ఎన్నో దోషాల వలన కూడా ఈ సమస్యలు వస్తాయి. కాకపోతే పితృదోషం ఉన్నపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పటం జరుగుతోంది. ఏ దోష కారణంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనేది కేవలం వారి వారి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలనలో మాత్రమే నిర్దరాణ జరుగుతుంది.

పితృదోషము వలన కలిగే సమస్యలు ఏమిటి?
పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.

పితృదోషముతో బాధపడేవారికి క్రింద ఇస్తున్న సంఘటనలలో కనీసం 4 నుండి 5 వరకు వారి జీవితములో తరచూ జరుగుతూ ఉండాలి. గమనించండి .

పితృదోషం ఉన్న వారు నివసించే ఇంటిలో కొత్త గోడలు అయినప్పటికి తొందరగా చీలికలు పడతాయి. తరచూ వారి ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోతూ ఉంటాయి. చేతిలో నుండి ఆహారము తరచూ నేల పాలు అవుతూ ఉంటుంది.
ఎన్ని సార్లు సరి చేయించినా గోడలలో నీరు లీక్ అవుతూ ఉంటుంది. చీలికలు ఉన్న గోడలలో చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయని కూడా చెప్పబడింది.
ఇతిలో తరచూ నీటి సమస్య, నీటి పంపు , కుళాయిల సమస్యలు వస్తూ ఉంటాయి. ప్లంబర్ వచ్చి ఎన్ని సార్లు సరి చేసినా ప్రయోజనం ఉండదు.
చీమల మందులు, దోమల మందులు ఎన్ని వాడుతున్నప్పటికి ఇంటిలో చీమలు, దోమలు, బొద్దింకలు, చెదలు బెదడు తగ్గదు.
పితృదోషము ఉన్నవారికి, వ్యాపారములు చేస్తూ ఉంటే వారు తీవ్రమైన అప్పులలో కూరుకుపోతారు. అగ్నికి మరియు దొంగతనాల బరీనా పడుతూ ఉంటారు లేదా వారి వ్యాపారములు అకస్మాత్తుగా మూతపడిపోతాయి.
పితృదోషం ఉన్నవారి ఇంటిలోని పిల్లలు పెద్దలకు మరియు కుటుంబ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. పిల్లలు మానసిక లేదా శారీరక లోపముతో జన్మిస్తారు.ఒక వ్యక్తికి పితృ దోషం ఉన్నదీ లేనిదీ జాతక పరిశీలన ద్వారా తెలుసుకొని పరిహారములు చేసుకొనవచ్చును.