విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్

0
159

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బుధవారం పాల్గొని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని  సీఎం దర్శించుకున్నారు. అలాగే పీఠం ప్రాంగణంలోఉన్నసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి, దాసాంజనేయ స్వామి  ఆలయాల సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరంరాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు రాజ శ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సీఎం జగన్ కు తెలియజేశారు. పీఠంలో సుమారు గంటసేపు సీఎం గడిపారు. ఈ కార్యక్రమంలో  సీఎం జగన్ పీఠంలోనే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. పీఠంలో నిర్వహించే కార్యక్రమాల గురించి సీఎం జగన్ కు శారదా పీఠాధిపతి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంవిశాఖ శ్రీ శారదాపీఠం వెబ్ సైట్ నుఆవిష్కరించారు.

పండితులకు సీఎం జగన్ చేతులమీదుగా సత్కారం జరిగింది ఈ వార్షికోత్సవంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంపీలు బీసెట్టి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ ,మంత్రులు అవంతి శ్రీనివాస్ ,సీదిరి అప్పలరాజు ,వెల్లంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్యేలు  అన్నం రెడ్డి ,అదీప్ రాజ్ గుడివాడ అమర్నాథ్ బూడిముత్యాలనాయుడు, తిప్పల నాగిరెడ్డి , రెడ్డి శాంతి ,మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి,  పంచకర్ల రమేష్ బాబు,  వైసిపి రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, వైసిపి నాయకులు సీతమ్మ రాజు, సుధాకర్, కే కే రాజు, వంశీకృష్ణ యాదవ్,దువ్వాడ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్, ఏ ఐ బి ఎఫ్ నాయకులు ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ తో పాటు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.