‘మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం’

307

అమరావతి, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ రిపీట్‌ అవుతాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపు చర్యల వల్ల విశాఖపట్నాన్ని దేశంలోనే ఉన్నతస్థాయిలో నిలిపామని చెప్పారు.

మున్సిపాలిటీల్లో ప్రభుత్వ అనుకూల పాలకవర్గాలు ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆ పాలక వర్గాలు ముందుకెళ్తాయన్నారు. శానిటైజేషన్‌ విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలోనే ఏపీకి అత్యుత్తమ గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు.