అయోధ్య రామ మందిరమే స్వాభిమాన సంకేతం

247

–  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్
– రామ మందిరానికి 1 లక్షా నిధి సమర్పణ 

శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శమని, నేడు అయోధ్యలో  నిర్మాణమవుతున్న శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతమని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు.  అయోధ్య రామ మందిర నిధి సమర్పణ లో భాగంగా మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో  శ్రీ రామజన్మభూమి తీర్ధ  క్షేత్ర ట్రస్ట్  సభ్యులకు ఒక లక్ష రూపాయల నిధి ని ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యరామాలయ   నిర్మాణానికి సమర్పణ చేసేఅదృష్టంమన తరానికి  రావడం పూర్వజన్మ సుకృత మేనని తెలిపారు.

దేశం లోని ప్రతి కుటుంబము యొక్క సమర్పణతో భవ్యమైన రామ మందిరం అయోధ్య లో నిర్మాణం కావడం , దానికయ్యే అయ్యే వ్యయం అంతా ప్రజల భాగస్వామ్యంతో జరగడం చారిత్రకమైన దన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ప్రపంచం లో ఈ హిందువులంతా ఆకాంక్షిస్తున్నారని సంజయ్ అన్నారు.

ఈ మందిర నిర్మాణం  కోసం  ఎన్నో పోరాటాలు చేశారని, 498 సంవత్సరాలుగా జరిగిన పోరాటం లో లక్షలాది బలిదానాలు, ప్రాణ త్యాగాలు జరిగాయని ఆయన చెప్పారు. నిరాశ, నిస్పృహల జీవితాన్నిఅనుభవించిన మన పూర్వపుతరాలవారు  ఉన్నారని  తెలిపారు. గతంలో తాను కూడా అయోధ్యలో  తలపెట్టిన కరసేవ  కార్యక్రమంలో  పాలు పంచుకున్నట్టు వివరించారు. అయోధ్యలో  నిర్మాణం అవుతున్న  శ్రీ రామ మందిరం చరిత్రపుటల్లో నిలిచే విధంగా తీర్చిదిద్దడానికి శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా సంయోజక్ కోమల్ రాజేందర్ రెడ్డి,సహ సంయోజక్ కుమ్మరి  కుంట సుధాకర్, నగర సంయోజక్ నిరంజనచారి,  దావురి  మురళితదితరులు పాల్గొన్నారు