పొట్ట కొవ్వు కరిగించికోండి 

102

పొట్ట కొవ్వు యమా డేంజర్.  కాబట్టి బొజ్జ తగ్గేందుకు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే పొట్ట పెరిగిపోతుంది. ఇంకా సరైన వ్యాయామం లేకపోవడం ద్వారా పొట్ట తగ్గదు. అయితే పొట్ట కొవ్వు పెరిగితే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే పొట్ట కొవ్వును త్వరలోనే కరిగించాలి. ఈ పొట్ట కొవ్వు తగ్గాలంటే.. డైట్ లో వాము చేర్చుకోవాలి.

అధిక బరువును తగ్గించుకునేందుకు వాము బాగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి రోజులో కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇంకా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సజ్జా గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్ ఈ, విటమిన్ కె, విటమిన్ బీలు ఉంటాయి. అలాగే డైటరీ ఫైబర్, కాపర్, క్యాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. తద్వారా అధిక బరువును తగ్గిస్తాయి.

శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను కరిగించి, అధిక బరువును తగ్గించడంలో పెసర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్లు ఏ, బీ, సీ, ఈ లతో పాటు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. నిత్యం ఒక కప్పు పెసర్లను ఉడకబెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు గోధుమ రవ్వను ఆహారంలో భాగం చేసుకకోవడం ద్వారా ఆరోగ్యం గా ఉండటంతో పాటు పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.