రాష్ట్రపతి ఎస్టేట్‌లో క్రీడా స్థల్‌ ప్రారంభం

129

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎస్టేట్‌లో రాష్ట్రపతి భవన్ క్రీడా స్థల్ (పునరుద్ధరించిన ఫుట్ బాల్ మైదానం, బాస్కెట్ బాల్ కోర్టు)ను, ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా న్యూఢిల్లీ వికాస్ పురిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పిల్లల కోసం పనిచేసే మై ఏంజిల్స్ అకాడమీ అనే ట్రస్టుకు చెందిన పిల్లలు ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ అత్యాధునిక క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేశారు. క్రీడాకార్యక్రమాల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనేలా ప్రోత్సహించడం కోసం రాష్ట్రపతి సచివాలయ హీరోస్; హౌస్ హోల్డ్ యంగ్స్; పి.బి.జి. వారియర్స్; ఆర్మ్ గార్డ్ డేర్ డెవిల్స్; ఢిల్లీ పోలీస్ సాల్-వార్ట్స్ – అనే ఐదు బృందాలతో ఒక అంతర్ విభాగాల ఫుట్ బాల్ టోర్నమెంటు ఈ రోజు నుంచి ప్రారంభమైంది.