88.5 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు

496

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్యసిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య నేడు 88.5 లక్షలు దాటింది. సాయంత్రం 6 గంటలవకు అందిన సమాచారం ప్రకార 1,90,665 శిబిరాల ద్వారా 88,57,341 మదికి టీకాలు వేశారు. వీరిలో 61,29,745 మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా 2,16,339 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. వీరితోబాటు కోవిడ్ యోధులు 25,11,257 మంది మొదటి డోస్ తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 2021 జనవరి 15న మొదలైన సంగతి తెలిసిందే. కోవిడ్ యోధులకు ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.

సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నేడు 31వ రోజు 6 వరకు 1,34,691 మంది టీకాలు తీసుకున్నారు. వారిలో 78,643 మంది టీకా లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 56,048 మంది ఆరోగ్య సిబ్బంది రెండవరోజు టీకాలు తీసుకున్నారు. తుది నివేదిక రాత్రి పొద్దుపొయాక అందుతుంది. తాత్కాలిక నివేదిక ప్రకారం సాయంత్రం 6 వరకు 6,293 శిబిరాలు నిర్వహించారు. మొదటి డోస్‌కు సంబంధించి టీకా అనంతర ప్రతికూల ప్రభావాలు 9 నమోదయ్యాయి. రెండవ డోస్‌కు నేడు 31వ రోజు సాయంత్రం 6 వరకు ఒక కేసు నమొదైంది.