క‌డియంలో..పూల‌తో కేసీఆర్ చిత్రం

839

కేసీఆర్‌పై క‌డియం న‌ర్స‌రీ అభిమానం పూలు, మొక్క‌ల‌తో సృజ‌నాత్మ‌క చిత్రం
– జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌ల్ల వెంక‌న్న

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఒక్క తెలంగాణలోనే కాదు. ఆంధ్రాలోనూ అసంఖ్యాక అభిమానులున్నారు. ఆయన ప్రసంగాలంటే పడిచచ్చేవారి సంఖ్యకు లెక్కలేదు. అసలు ఆంధ్రాలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ పెట్టాలన్న డిమాండ్ కూడా వినపించకపోలేదు. భీమవరం వంటి ప్రాంతాల్లో అయితే కేసీఆరస్-కేటీఆర్-తలసాని శ్రీనివాసయాదవ్ కటౌట్లు సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా దర్శనమిస్తుంటాయి. తాజాగా కేసీఆర్ జన్మదినం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో ప్రత్యేకంగా పూలతో ఆయనకు జన్మదినశుభాకాంక్షలు చెప్పిన వైచిత్రి ఇది.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.