భారత్‌లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల తగ్గుదల

215

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు వేగంగా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 1.36.872కి తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1.25% మాత్రమే. ఇప్పటివరకు 1,06,33,025 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో 11,805 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 97.32% కాగా ఇది ప్రపంచంలోనే అత్యధికం. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా మరింత పెరుగుతూ ఈ రోజుకు 1,04,96,153 అయింది. మరో సానుకూల అంశమేంటంటే 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. డామన్, డయ్యూలోను, దాద్రా-నాగర్ హవేలి లోను కోలుకున్నవారి శాతం 99.88%.

17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: లక్షదీవులు, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్, మేఘాలయ, లద్దాఖ్, మణిపూర్, హర్యానా, అండమాన్, నికోబార్ దీవులు,రాజస్థాన్, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా-నాగర్ హవేలి, డామన్-డయ్యూ. అలాగే 6 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కొత్త కోవిడ్ కేసు కూడా రాలేదు. అవి: సిక్కిం, మేఘాలయ, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, త్రిపుర, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.

2021 ఫిబ్రవరి 16 వతేదీ ఉదయం 8 గంటలకు మొత్తం దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య 87 లక్షలు దాటింది.. దేశవ్యాప్త టీకాల కార్యక్రమాన్ని ప్రధాని 2021 జనవరి 16న ప్రారంభించటం తెలిసిందే. ఉదయం 8 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం మొత్తం 1,84,303 శిబిరాలలో 87,20,822 మందికి కోవిడ్ టీకాలు వేశారు. వీరిలో 61,07,120 మంది మొదటి డోసు ఆరోగ్య సిబ్బంది, ఉండగా 1,60,291 మంది రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది, 24,53,411 మంది మొదటి డోస్ కోవిడ్ యోధులు ఉన్నారు.

కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన 31వ రోజైన ఫిబ్రవరి 15 నాడు మొత్తం 4,35,527 మంది టీకాలు వేయించుకున్నారు. వారిలో 2,99,797 మందికోసం 10,574 శిబిరాలలో మొదటి డోస్ టీకా ఇచ్చారు. 1,35,730 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు. గత 24 గంటలలో 9,121 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ కొత్త కేసులలో 80.54% ఐదు రాష్ట్రాలకు చెందినవే. మహారాష్ట్రలో అత్యధికంగా 3,365 కేసులు రాగా కేరళలో 2,884, తమిళనాడులో 455 కెసులు వచ్చాయి. గత 24 గంటలలో 81 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 70.37% ఐదు రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 23 మంది, ఆ తరువాత కేరళలో 13 మంది, పంజాబ్ లో 10 మంది చనిపోయారు.