సీధీ ఘటన పట్ల ప్ర‌ధానమంత్రి సంతాపం

0
89

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (న్యూస్‌టైమ్): మ‌ధ్యప్ర‌దేశ్‌లోని సీధీలో ఒక బ‌స్సు ప్ర‌మాదం ఘ‌ట‌న వ‌ల్ల మ‌ర‌ణాలు సంభ‌వించినందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘మ‌ధ్యప్ర‌దేశ్‌లోని సీధీలో జరిగిన బ‌స్సు ప్ర‌మాదం భ‌య‌పెట్టేదిగా ఉంది. ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబాల‌కు ఇదే నా సంతాపం. ర‌క్ష‌ణ‌, స‌హాయ‌క కార్యాలలో స్థానిక పాల‌న యంత్రాంగం చురుకుగా పాలుపంచుకొంటోంది.’’ అని ప్ర‌ధానమంత్రి మాటలను ఉదాహరిస్తూ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పీఎంఓ) ఒక ట్వీట్‌లో పేర్కొన్నది.