కేసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటుదాం

0
157

సంగారెడ్డి జిల్లా జైలులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటా
హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ

ఫిబ్రవరి 17 న రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని కోటి వృక్షార్చన సంకల్పం ఒక గొప్ప విషయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ప్రజలు
అందరూ మొక్కలు నాటడం, సంరక్షించడం మన బాధ్యత అనే కాకుండా…ఇది మన బంగారు భవిష్యత్తుకు బాట అవుతుంది అని సంకల్పించాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే హరితహారం కార్యక్రమం మొదలు పెట్టి ఇప్పటికే మొక్కలు/చెట్లు పెంచడంలో పురోగతి సాధించామని, ప్రకృతిని కాలుష్యం కోరల నుండి కాపాడాలంటే, మొక్కలు పెంచడం, వృక్షాలను కాపాడడం ఒక్కటే పరిష్కారం అని అభిప్రాయపడ్డారు.వృక్షాలు ఉంటేనే మన మనుగడ అని, ముఖ్యమంత్రి హరితహారం మొదలుపెట్టారు.

కాబట్టి, వారి పుట్టిన రోజు సందర్భంగా, రాష్ట్ర ప్రజలంతా విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా కోటి వృక్షార్చన చేయడమే వారికి రాష్ట్ర ప్రజలు ఇచ్చే బహుమతి, గౌరవం అని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరుగుతుందని, ఆక్సిజన్ వృద్ధి చెందుతుందని, వర్షాలు సకాలంలో కురుస్తాయని, అంతే కాకుండా ప్రకృతిని సహజంగా,స్వచ్చంగా ఉంచి విపరీత వ్యాధులనుండి కాపాడుకోగలమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్క నాటాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా, సంగారెడ్డి జిల్లా జైలులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటానని హోం మంత్రి తెలియ జేశారు.