‘సీఎం ఆఫ్‌ ది ఇయర్‌’గా జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

312

అమరావతి, ఫిబ్రవరి 16 (న్యూస్‌టైమ్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్కోచ్‌ ‘సీఎం ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలు ఆయ‌న‌ను అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరొచ్చేలా చేశాయి.

ఈ మేరకు స్కోచ్‌ గ్రూపు ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ అవార్డును అంద‌జేశారు. ఈ ఏడాది అత్యుత్తమ పాలనను అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, సుపరిపాలనలో రాష్ట్రాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ అగ్రస్థానంలో నిలిపారని స్కోచ్ చైర్మ‌న్‌ ప్రశంసించారు.