అసెంబ్లీ కార్యదర్శికి గంటా రాజీనామా లేఖలు

0
231

స్పీకర్ ఫార్మేట్ లో నాలుగు లేఖలు  సమర్పణ

రాష్ట్ర మాజీ మంత్రి. విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖలను సోమవారం వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ద్వారా అసెంబ్లీ కార్యదర్శి పి బాల కృష్ణమాచార్యులుకు  అందజేశారు… తన రాజీనామా ఆమోదానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలి అని గంటా ఆ లేఖల్లో  కోరారు.. ఈ లేఖలు ను తాను స్పీకర్ పొర్మాట్ లోనే  పంపించడం జరిగింది అని గంటా కార్యదర్శి కి ఫోన్లో స్పష్టత ఇచ్చారు..ఇంకా ఎటువంటి వివరాలు కావాలి అన్న  తాను అందచేస్తా అని గంటా స్పష్టం చేసారు.  అసెంబ్లీ కార్యదర్శి మాట్లాడుతూ ఈ లేఖలను తాను  స్పీకర్  తమ్మినేని సీతారాం కి పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అనంతరం గంటా రాజీనామా  లేఖలను అసెంబ్లీ కార్యదర్శి పి.బాల కృష్ణమాచార్యులుకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు.. ఎం ఎస్ అర్ ప్రసాద్ తదితరులు చేతులు మీదుగా అందచేశారు.. ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజలు కు.. ప్రభుత్వం కి వారధి గా నిలిచే జర్నలిస్ట్ ల ద్వారా తన రాజీ నామా లేఖ లు అందచేయాలి అని గంటా భావించి తమకు వాటిని అప్పగించినట్లు చెప్పారు. ఈ మేరకు తాము బాధ్యత గా వాటిని అసెంబ్లీ కార్యదర్శి కి అందచేసినట్లు చెప్పారు..తదుపరి నిర్ణయం వారు తీసుకుంటారని..తమ బాధ్యత తీరింది అని శ్రీనుబాబు చెప్పారు..