ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం

0
235

ప్రజా సచివాలయాల ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం- ఎం.డి.జాని పాషా

ఈ సందర్బంగా మాట్లాడుతూ అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా,నాణ్యమైన ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలు ప్రజలకు నేరుగా అందించడమే లక్ష్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని  గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.జాని పాషా  తెలిపారు .  అయితే  రాష్ట్ర వ్యాప్తంగా గత 15నెలలుగా నిర్విరామంగా అలుపెరుగని సేవలందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పై కొన్ని చోట్ల కొంతమంది దుర్మార్గుల ఆగడలు రోజురోజుకూ శృతిమించుతూ గతంలో జరిగిన  సంఘటనలు మరువకముందే శుక్రవారం మధ్యాహ్నం సుమారు  3గంటల సమయంలో భీమవరం పట్టణంలో 33వ వార్డులో పనిచేస్తున్న వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న టి.కార్తీక్ తన విధి నిర్వహణలో భాగంగా నిర్మాణంలో వున్న భవనం వద్దకు వెళ్లి ఇంటి ప్లాన్ అడగటంతో వాచ్మన్ ద్వారా సమాచారం తెలుసుకున్న భవన యజమాని ప్రముఖ వైద్యులు మధునూరి గోపాలకృష్ణ కుమారుడు అతను కూడా డాక్టర్ అయినా విచక్షణ కోల్పోయి విధినిర్వహణలో వున్న ప్రభుత్వ ఉద్యోగిపై విచక్షణారహితంగా ముఖం శరీరం మీద పిడిగుద్దుల వర్షం కురిపించి గాయ పరిచిన విషాద ఘటన భీమవరంలో జరగటం బాధాకరం.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులుగా భయాందోళన చెండుతున్నారని  తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మరియు దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు అమలు జరిగేలా చూడాలని,ఉద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెండాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహారిస్తుందన్న నమ్మకం ఉందని ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు