శీతాకాలంలో ఈ కషాయం తాగి చూడండి

164

ఈ ఏడాది వర్షాలు విపరీతంగా కురవటంతో దేశవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. మామూలుగా అయితే సంక్రాంతి తరువాత చలి కాస్త తగ్గుముఖం పడుతుంది కానీ ఈ ఏడాది మాత్రం వణికించేస్తోంది. దీంతో జలుబు వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చలిగాలులు కూడా తోడుకావటంతో జలుబు ఎన్నిరోజులైనా తగ్గటంలేదని చాలామంది వాపోతున్నారు.

ఇమ్యూనిటీ బలహీనపడటంతో మనకు జలుబు వస్తుంది. అందుకే మీరు ఇమ్మూనిటీ బూస్టర్లపై కూడా దృష్టిసారించాలి. జలుబుకు మంచి హోంరెమెడీ ఏదైనా ఉందా అంటే చాలానే ఉన్నాయి. ఆనియన్-హనీ సిరప్ ను మీరు ట్రై చేసి చూడండి.. తక్షణం మీకు మంచి ఉపశమనం లభించటం ఖాయమని ప్రకృతివైద్యం రుజువుచేస్తోంది. కేవలం జలుబు తగ్గటమే కాదు ఇతరత్రా ప్రయోజనాలు దీంతో చాలానే ఉన్నాయి. ఆయుర్వేదలో కూడా ఇది నిరూపితమైంది. అందరి ఇళ్లలో ఉల్లిపాయలుంటాయి, శ్రేష్ఠమైన తేనె ఒక్కటి దీనికి చేర్చితే చాలు చక్కని వంటింటి చిట్కాను మీరు స్వయంగా తయారుచేసుకుని ఉపయోగించవచ్చు.

కషాయం తయారీ..

ముందు పెద్ద ఉల్లిపాయలను రెండు తీసుకుని వాటిని ముక్కలుగా తరగండి. తక్కువ మంటపై వీటిని వేయించుకోవాలి. ఇలా రెండు గంటలపాటు వీటిని వేయించాలి. వేయించేప్పుడు ఉల్లి ముక్కలకు సరిపోయేంత తేనె వేయాలి. ఇలా కాసేపు వేయించే క్రమంలో ఉల్లిపాయలోని నీళ్లన్నీ పోయి క్రమంగా కషాయం వస్తుంది. దీన్ని గాలి దూరని జార్ లో పోసి నిల్వఉంచాలి. ఇలా తేనెలో ఉల్లి ముక్కలను ఉడికించి కషాయం చేసే ఓపిక, సమయం లేకపోతే కనీసం పచ్చి ఉల్లిపాయ ముక్కలను తేనెలో ఒకరోజంతా ఊరబెడితే సరి.

యాంటీబ్యాక్టీరియల్..

ఈ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఎర్రగడ్డల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువ. ఇది ఇన్ఫెక్షన్లపై సమర్థవంతంగా దాడిచేసేందుకు మీకు సహకరిస్తుంది. ఆనియన్స్ లో ఫ్లేవనాయిడ్స్ , ఆల్కెనిల్ సిస్టైన్ సల్ఫాక్సైడ్స్ రెండూ ఎక్కువ. ఇవి రెండూ యాంటీఆక్సిడెంట్లు కనుక ఫ్రీరాడికల్స్ పై సమర్థవంతంగా పోరాడుతాయి. ఈ రెండు కాంపౌండ్లు గుండె జబ్బులతోపాటు ఇతర అనారోగ్యాలు రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంది.

ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ పై పోరాటం..

జలుబు వంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వైరస్ ల తీవ్రతో ముక్కులో, గొంతులో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. దీంతో ముక్కు, గొంతు మూసుకుపోయి చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఉల్లిలోని ఫ్లేవనాయిడ్స్ యాంటీ -ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లద్వారా కోల్డ్ సిప్టమ్స్ తగ్గుముఖం పట్టి మీరు సాధారణ స్థితికి వేగంగా చేరుకుంటారన్నమాట. శీతాకాలంలో అలర్జీలు రావటం చాలా సహజం. ఇవన్నీ సీజనల్ వ్యాధుల కోవలోకి వస్తాయి. దీనికి ప్రధాన కారణం మనం చలికాలంలో ఎక్కువ ఇంట్లోని ఉండిపోతాం కానీ బయటికి పెద్దగా వెళ్లం. దీంతో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలు, పిల్లులు వంటివాటి జుట్టు తగలటం, ఇంట్లోని దుమ్ము-ధూళి, డెడ్ స్కిన్ తాలూకు పొడి రాలటం, ఇంట్లో చెట్లు ఉంటే వాటి పుప్పొడి రేణువుల వల్ల మనకు అలర్జీలు వస్తాయి. ఇలాంటి అలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మనకు ఇచ్చేది ఉల్లిపాయలే. అందుకే మన పెద్దలు అంటారు ఉల్లి చేసే మేలే తల్లికూడా చేయదని.

మధురమైన ఔషధం..

ఇక తేనె గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అత్యంత మధురమైన, కమ్మని ఔషధం. గొంతు సంబంధిత సమస్యలను ఇట్టే దూరం చేసే ఔషధ గుణాలు సహజసిద్ధంగానే తేనెకు ఉన్నాయి. యాంటీమైక్రోబియల్ యాక్టివిటీ తో పాటు యాంటీఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉన్నాయి కనుక శీతాకాలంలో తేనె చాలా మంచిది. యాంటీఇన్ఫ్లమేటరీ సుగుణాలున్న తేనె చలికాలంలో అనారోగ్యాలకు విరుగుడు. తేనెను ఉల్లితో కలిపి తీసుకుంటే గుండె జబ్బులు, క్యాన్సర్ తో పాటు పలు అనారోగ్యాలకు చెక్ పెట్టడానికి సాధ్యమవుతుంది. కానీ మార్కెట్లో లభించే తేనె అంతా బెల్లంతో తయారైనవి లేదా సింథటిక్ సిరప్ లే.