ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల !

653

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. ఏపీలో రెండు ఉపాధ్యాయ , తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ విషయానికి వస్తే వచ్చే నెల 14వ తేదీన తూగో-పగో, కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 29వ తేదీన సిట్టింగ్ ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, రామకృష్ణ రిటైర్ కాబోతున్నారు. ఈ నెల 16న నోటిఫికేషన్ అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండనుంది. ఈ నెల 26న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. వచ్చే నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ ఉండనుంది. వచ్చే నెల 22వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కూడా ఈ నెల 16న నోటిఫికేషన్ అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండనుంది. ఈ నెల 26న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. వచ్చే నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ ఉండనుంది.