ఈనెల 22,23 తేదీల్లో కొండపల్లి షాఋఖారి దర్గా 424 ఉరుసు మహోత్సవం

512

ఉత్సవ కమిటీ చైర్మన్ గా అల్తాఫ్ బాబా తిరిగి ఎన్నిక.
ప్రతి సంవత్సరంలాగే అంగరంగ వైభవంగా ఉరుసు మహోత్సవం నిర్వహిస్తాం.
కులమత ప్రాంతాలకు అతీతంగా భక్తులు పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందగలరు.
 ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగి, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ షాఋఖారి దర్గా 424 వ ఉరుసు మహోత్సవం ఫిబ్రవరి 22,23 తేదీల్లో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‌ఉరుసు మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ గా దర్గా ముతవల్లీలు,ముజావర్లు మరియు ముస్లిం పెద్దలు, బాబా వారి భక్తులు కలసి ఏకగ్రీవంగా తిరిగి అల్తాఫ్ బాబాను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా షాఋఖారి బాబా ఉరుసు మహోత్సవం నిర్వహిస్తామని, దర్గా ప్రాంగణం మొత్తం పూర్తిగా విద్యుత్ దీపాల అలంకరణతో, ఉరుసు మహోత్సవానికి వచ్చే భక్తులకు బాబా గారి లంగర్ ఖాన ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని,ఈ సంవత్సరం కూడా దాదాపు లక్షమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

22వ తేదీన రాత్రి 9 గంటలకు ముజావర్ ఇంటినుండి ప్రారంభమైన గంధం ఊరేగింపు రైల్వే స్టేషన్ మీదుగా కొండపల్లి వీధుల వెంట మేళతాళాల మధ్య అట్టహాసంగా ఊరేగింపుతో తెల్లవారుజామున 3 గంటలకు దర్గా వద్దకు చేరుతుందని తెలిపారు. 23వ తేదీన దీపారాధన (చిరాగ్) కార్యక్రమం జరుగును.కావున భక్తులు ఉరుసు మహోత్సవంలో పాల్గొని హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా వారి ఆశీస్సులు పొందగలరు.

ఈ సమావేశంలో దర్గా ముజావర్లు రహీముల్లా షా, హబీబుల్లా షా,ఫకురుల్లా షా, కరిముల్లా, హాజీ, రెహమాన్ న్యాయవాదులు మసూద్ అలీ జిన్నా, రెహమాన్, ముస్లిం పెద్దలు షేక్ ఫరీద్, మసీఉల్లా, శేఖర్, చాన్ బాషా, నజీర్ బాబా, రంజాన్, ఖాజా  ఆర్ రెహమాన్, మోసిన్, అన్సారీ, వెలగలేరు భాష‌ తదితరలు పాల్గొన్నారు.