చంద్రబాబుకు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరింది

203

ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ ఇప్పించండి
రాష్ట్రంలో స్పష్టంగా కన్పిస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభంజనం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో 85 శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులే సర్పంచ్ లుగా విజయం సాధిస్తారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు .

శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు . చంద్రబాబుకు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరిందన్నారు . రెండవ విడత పంచాయతీ ఎన్నికలు కూడా ముగియగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ , అమెరికా అధ్యక్షుడు జోబైడర్లకు కూడా లేఖలు రాస్తాడన్నారు . లేఖలు రాయడానికి పెట్టుబడి అవసరం లేదని , ఎవరో తయారుచేసిన లేఖపై సంతకం చేసి పోస్ట్ చేస్తుంటాడన్నారు . చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయిందని , ఇంకా రానురానూ ప్రపంచ దేశాలకు , ఐక్యరాజ్యసమితికి కూడా లేఖలు రాసే పరిస్థితికి వెళ్తాడన్నారు . ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని , ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చూపించి తగిన ట్రీట్ మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు .

లోకేష్ హాఫ్ నాలెడ్జ్ గాడని , ముఖ్యమంత్రి కొడుకుగా , మనవడిగా , మూడుశాఖలకు మంత్రిగా చేసిన దద్దమ్మగా అభివర్ణించారు . చంద్రబాబు మాదిరిగా లోకేష్ కూడా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చాడని , మంగళగిరిలో పోటీచేసి దారుణంగా ఓడిపోయాడన్నారు . ప్రజల మద్దతుతో గెల్చిన చరిత్ర చంద్రబాబుకు , లోకేష్ కు లేదన్నారు . పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడి నుండైనా లోకేష్ సర్పంచ్ గా పోటీచేసి గెలిస్తే తాను రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతానన్నారు . పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంటుందో గుడివాడ నియోజకవర్గంలో కూడా అదే ప్రభంజనం కన్పిస్తుందన్నారు . గత 20 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు , పార్టీలు , వర్గాలను సీఎం జగన్మోహనరెడ్డి సమదృష్టితో చూస్తూ వస్తున్నారన్నారు . ఎన్నికల్లో పులివెందుల్లో ఎక్కువ రావడం , మిగతా ప్రాంతాల్లో తక్కువ రావడం వంటివి ఉండవన్నారు . కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో సొల్లు , పోసుకోలు దేవినేని ఉమా ఉంటాడని , అక్కడ 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 పంచాయతీలను వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు సర్పంచుగా గెలిచారని , టీడీపీ మద్దతు అభ్యర్ధులకు మూడు పంచాయతీలు దక్కాయన్నారు .

ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వైసీపీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్ధులు 112 పంచాయతీలను గెల్చుకోగా టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు కేవలం 23 పంచాయతీల్లోనే విజయం సాధించారన్నారు . రాష్ట్రంలో ఎక్కడైనా చంద్రబాబును ఎక్కువగా భుజాన వేసుకుని సొల్లు కబుర్లు చెబుతూ జగన్మోహనరెడ్డిని తిడితే అక్కడ మరీ దారుణంగా టీడీపీకి బుద్ధి చెబుతూ 90 శాతంకు పైగా మెజార్టీ సీట్లను వైసీపీ మద్దతు అభ్యర్ధులకు కట్టబెడుతున్నారన్నారు . దీన్ని చూసిన చంద్రబాబుకు మైండ్ పోయి , చిన్న మెదడు చితికిందని , పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు . ఒక వ్యూహంతోనే ఎంపీటీసీ , జడ్పీటీసీ , మున్సిపల్ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలను తెరపైకి తెచ్చారన్నారు . గ్రామాల్లో ప్రజలను వర్గాలుగా విడగొట్టి మొదటి విడతలోనే 3 వేలకు పైగా పంచాయతీలు వస్తాయనే పగటి కలలు కన్నారన్నారు . జగన్మోహనరెడ్డి ప్రభంజనం స్పష్టంగా కన్పిస్తోందని , మిగతా విడతల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇటువంటి ఫలితాలే ఉంటాయని మంత్రి కొడాలి నాని తెలిపారు .