కవులు,కళాకారులకు జగన్ ప్రోత్సాహం: విజయసాయిరెడ్డి

116

క‌వుల‌ను క‌ళాకారుల‌ను ప్రోత్సహించ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ముందువ‌రుస‌ల‌లో ఉంటుంద‌ని వైకాపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంపి విజ‌య సాయి రెడ్డి అన్నారు. ఈ మేర‌కు విశాఖ సాహితీ స్వ‌ర్ణోత్స‌వ సంబ‌రాలకు సంబందించిన బ్రోచ‌ర్ ను సాహితీ స‌బ్యుల‌తో క‌లిసి విశాఖ‌ప‌ట్నం స‌ర్య్యూట్ హౌస్ లో ఆవిష్కించారు. ఈ స్వ‌ర్ణోత్స‌వ సంబ‌రాలు ఏప్ర‌ల్ 4 వ తేదీన  విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించ‌నున్నామ‌ని సాహితీ స‌బ్యులు తెలిపారు. సాహిత్యం, సాంస్కృతిక‌, సామాజిక‌, విద్య‌, సాంకేతిక, వైజ్ఞానిక విష‌యాలను స‌మాజినికి ప‌రిచయం చేయ‌డానికి,మ‌రియు ఔత్సాహిత ర‌చ‌యిత‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి విశాఖ సాహితీ 1971లో ప్రారంబించ‌డం జ‌రిగింది. భాత‌ర దేశసంస్కృతీ సాంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించే క్ర‌మంలో క‌వి సమ్మేళ‌నాలు,అష్టావ‌దానాలు, శ‌తావ‌ధానాలు, భార‌త భ‌గ‌వత రామాయ‌నాలపై ఉప‌న్యాసాలు,పుస్త‌కావిష్క‌ర‌ణాలు, భువ‌న విజ‌యాలు ప్ర‌ముఖ క‌వుల జ‌యంతి ఉత్స‌వాలునిర్వ‌హిస్తున్నట్లు  సాహితీ స‌బ్యులు తెలిపారు. కార్య‌క్ర‌మంలోప్ర‌గ‌తిభార‌త్ ట్ర‌స్టు స‌బ్యులు ఎస్. ఆర్. గోపినాద్ రెడ్డి,  విశాఖసాహితి అద్య‌క్షులు ప్రోఫెస‌ర్ కె మ‌ల‌య‌వాసిని, ఉపాధ్య‌క్ష‌లు డాక్ట‌ర్కందాన క‌న‌క మ‌హాల‌క్ష్మి, ట్ర‌స్టు స‌బ్యులు మ‌రియు రిటైర్డ్ ఎ.ఎస్.పి ఎస్ దివాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.