జగన్ కి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు ఫోబియా పట్టుకుంది

662

• చిత్తూరుజిల్లా కేంద్రంగా డబ్బు, అధికారబలంతో  ఏకగ్రీవాలుచేయించి, ఇసుక, ఎర్రచందనం మాఫియాల్లో మునిగితేలుతున్న పెద్దిరెడ్డి కన్నా మించిన వెన్నుపోటు దారులుఎవరైనా ఉంటారా?
• పెద్దిరెడ్డికి నిజంగా అంతటి ప్రజాబలమే ఉంటే, ఆయన తక్షణమే తనపదవులకు రాజీనామా చేసి, తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసి, ఏకగ్రీవంగా గెలవాలి.
• చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ప్రతిపక్షానికిచెందినవారిని కుప్పంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారా?
• విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో జగన్నాటకం మొత్తాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బయటపెట్టేశారు.
• నిజంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో జగన్ కు సంబంధం లేకుంటే,ఆయన తక్షణమే తనపార్టీకి చెందిన 28 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలి.
ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడైతే పోలీస్ బలం,అధికార బలం ఉపయోగించి తననియోజకవర్గంలో పంచాయతీలను ఏకగ్రీవంచేసుకున్నాడో, ఎప్పుడైతే తొలివిడతపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో అప్పట్నుంచీ  ఆయనకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబునాయుడి ఫోబియా పట్టుకుందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ  బుద్దావెంకన్న ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల  సమావేశం నిర్వహించారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..   అనేకరకాలుగా ప్రజలను భయపెట్టి, డబ్బు, అధికారబలాన్ని ఉపయోగించినా ప్రజలు పంచాయతీఎన్నికల్లో ఇంకా టీడీపీ పక్షానే ఉంటటం, చంద్రబాబుని ఆదరించడం చూసిన మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ఇతరనేతలుఏదిపడితే అది మాట్లా డుతున్నారు. చంద్రబాబునాయుడిని వెన్నుపోటు దారుడు అంటు న్నవారు, సొంతబాబాయిని దారుణంగా  నరికిచంపించి బాత్రూమ్ లో పడుకోబెట్టారు. సొంతమీడియాలో హార్ట్ ఎటాక్ తో చనిపోయా డని చెప్పించింది మీరుకాదా? జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నషర్మిల, నేడుఆయనకు ఎదురుతిరిగారంటే, అందుకు జగన్ ఆమెను పొడిచిన వెన్నుపోటుకాదా? 151స్థానాలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డి వారిని దారుణంగా వెన్ను పోటు పొడిచాడు. వారికిచ్చినహామీలను తుంగలోతొక్కి, వారిని మోసగించాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబుని దూషించడమేంటి? జగన్ కు, పెద్దిరెడ్డికి చంద్రబాబునాయుడి ఫోబియా పట్టుకోబట్టే, వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పుంగనూరులో ఏకగ్రీవా లు ఎలా అయ్యాయో, వాటివెనకున్న రహస్యమేంటో అందరికీ తెలుసు. నిజంగా పెద్దిరెడ్డికి అంతటి ప్రజాబలమే ఉంటే, ఆయన తన పదవికి రాజీనామాచేసి, తిరిగిఎన్నికల్లో పోటీచేయాలి. ఆయన తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తే, ప్రజలంతా ఆయన వెంటే ఉన్నార ని తాముకూడా నమ్ముతాం. చిత్తూరుజిల్లాలో తిరుగులేని నాయ కుడని భావిస్తాం.

బలవంతంగా బెదిరించి ఏకగ్రీవాలకు పాల్పడిన పెద్దిరెడ్డి, తానుచంద్రబాబునాయుడికంటే బలమైన నాయకుడినని చెప్పుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు అధికారంలోఉన్నప్పుడు, ప్రతిపక్షానికి చెందినవారిని నామినేషన్లు వేయకుండా, కుప్పంలో ఏనాడైనా అడ్డుకున్నారా? అటువంటి వ్యక్తితో మీరు పోల్చుకోవడ మేంటి? పెద్దిరెడ్డి లాంటివారు చంద్రబాబుని చూడాలంటే తలెత్తి చూడాలి. అలా తలెత్తే అవకాశం లేని దుర్మార్గాలు, దారుణాలు అన్నీ పెద్దిరెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని, రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఎవరూ అనలేదు. ఒక్క సాక్షి మీడియాకు మాత్రమే అంతాబాగున్నట్లు అనిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఆందోళ నలు జరుగుతుంటే, అక్కడున్నవారెవరూకూడా జగన్ నాయక త్వాన్ని సమర్థించే స్థితిలో లేరు.

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరంటే ఎవరి పేరు చెబుతారో, ఇసుక మాఫియాలో ఎవరు మునిగితేలుతున్నారో, అక్కడ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అక్కడికివెళ్లి ప్రజలను అడిగితే, చంద్రబాబునాయుడు ప్రజల నాయకుడో, పెద్దిరెడ్డి నాయకుడో తెలిసిపోతుంది.

ఎన్నికలన్నాక గెలుపోటములుసహజం. ఒకరికి ఎక్కువస్థానాలు రావడం, మరొకరికి తగ్గడం అనేది సర్వసాధారణం. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నిసీట్లువస్తాయో ఒక్కసారి ఆపార్టీ వారు ఆలోచనచేస్తే మంచిది. టీడీపీకి 23సీట్లే వచ్చినా, కొందరు అవకాశ వాదులు వైసీపీలోచేరినా, దమ్ముగా, ధైర్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఆపార్టీ అధినేత అందరం సమిష్టిగా ప్రజలపక్షానే పోరా డుతున్నారు. అందుకే అధికారపార్టీకి వణుకుపుడుతోంది.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జగన్నాటకం మొత్తాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ బయటపెట్టేశారు. జగన్ ఫ్యాక్టరీని కొట్టేయ డానికి ఎవరితో, ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపాడో ఆధారాల తోసహా కేంద్రమంత్రి పార్లమెంట్ లో బయటపెట్టడంతో , దిక్కుతోచక విజయసాయి రెడ్డి విశాఖపట్నానికి పారిపోయి వచ్చేశాడు. అక్కడి కివచ్చాక కారాగారానికి, కర్మాగారానికి తేడా తెలియకుండా మాట్లా డాడు. ఒడిశాకు చెందిన కేంద్రమంత్రికి విశాఖపట్నం అంటే పడదుకాబట్టి, ఆయన ఏదేదోచెప్పాడని బుకాయించాలని చూశా రు.

నిజంగా విశాఖఫ్యాక్టరీని కాపాడుకోవాలని విజయసాయికి, జగన్మోహన్ రెడ్డికిఉంటే, వారి పార్టీ ఎంపీలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలి. అప్పుడు తాముకూడా తమపార్టీ ఎంపీలతో రాజీనామాచేయించి, ప్రజల్లోకి వెళితే, అక్కడే తేలిపోతుంది. 25 మంది ఎంపీలను ఇస్తే, కేంద్రం మెడలు వంచుతా మని చెప్పినవారు, ఇప్పుడు తమకున్న 28 మందిఎంపీలతో ఢిల్లీ వెళ్లి కేంద్రపెద్దలపై పోరాడాలి. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో జగన్ పాత్ర ఉండబట్టే, ఆయన, ఆయనపార్టీకి చెందిన నేతలంతా  సైలెంట్ గా ఉంటున్నారు.  జగన్ వెన్నుపోటుదారుడో, చంద్రబాబు  వెన్నుపోటు దారుడో ప్రజలకు అర్థమైంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోతే, ఆనాడున్నఎంపీలను ఎర్రన్నాయుడి సారథ్యంలో ఆనాటి ప్రధాని వాజ్ పేయ్ గారిని కలిసేలా చేసి, ఆ వ్యవహారాన్ని అడ్డుకున్నారు. అది అందరికీ తెలిసిన పచ్చినిజం. దాన్ని కాదని చెప్పే ధైర్యం వైసీపీవారికుందా?

చంద్రబాబునాయుడి గురించి, టీడీపీ గురించి సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలే రాస్తారు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. సాక్షిలో టీడీపీకి తొలివిడతలో 520 స్థానాలు వచ్చాయని రాశారంటే, ఆ సంఖ్యపక్కన ఒకటి కలుపుకో వాల్సిందే. వెన్నుపోటు దారుడు అనే పేరు జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డికి సరిపోయినంతబాగా మరెవరికీ సరిపోదు. ఇంకా రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో టీడీపీ కచ్చితంగా మెజారిటీ గ్రామాలను కైవశంచేసుకొని తీరుతుం ది. ఆ ఫలితాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డిలో చంద్రబాబునాయుడి ఫోబియా మరింత ఎక్కువవుతుంది. అది తట్టుకోలేక, ఆయన, ఆయన ప్రభుత్వం ప్రజలను మరింత హింసిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.