పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం పైగా వైయస్ఆర్సీపీ స్వీప్

303

ఓటమిని ఉత్సాహంతో టీడీపీ సెలబ్రేట్ చేసుకోవడం వింతగా ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్..

*- బడాయికి పోయి గోచీని తీసేసి తలకు చుట్టుకున్నట్టు ఉంది టీడీపీ వ్యవహారం*
*- ప్రపంచంలోనే వెన్నుపోటుదారుడు అన్న ఏకైక బిరుదు ఉన్న వ్యక్తి చంద్రబాబే..*
*- ప్రతిపక్ష టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది.. ఓటమిని హుందాగా ఒప్పుకో చంద్రబాబూ..*
*- తొలిదశలో భారీగా వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు*
*- ఊహించినట్లుగానే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి*
*- తొలిదశలో 2,637 మంది వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు గెలిచారు*
*- ప్రజలను తప్పుదారి పట్టించేలా అశ్వత్థామ హతః అన్నట్లు ఈనాడు కథనాలు ఉన్నాయి, ఇది సరికాదు*
*- పంచాయితీ తీర్పు ఇంత నష్టంగా ఉంటే…. ఎల్లో మీడియా వక్రభాష్యం ఏమిటి?*
*- టీడీపీ అగ్రనాయకుల నియోజకవర్గాల్లో కూడా ఓటమే.. అయినా ప్రగల్భాలా..?*
*- ఎస్ఈసీ నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేశారు.. అయినా ఫలితం మారలేదు*
*- నిమ్మగడ్డ అధికారులను ఎంత ఇబ్బంది పెట్టినా, టెర్రరైజ్ చేసినా నిష్పక్షపాతంగా పనిచేశారు*
*- ఎన్నికలకు ఎప్పుడూ వైయస్‌ఆర్‌సీపీ రెడీనే.. ఎన్నడూ భయపడదు*
*- అరిగిపోయిన రికార్డులా చంద్రబాబు, నిమ్మగడ్డ చెప్పినా.. చివరికి ఏమైంది..?*

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..

1. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు నుంచి వైయస్‌ఆర్‌సీపీ అనుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. 2019 ఎన్నికల తర్వాత ఏర్పడిన శ్రీ వైయస్‌ జగన్ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తోంది. అంతేకాకుండా వ్యవస్థలో మార్పులు తెస్తోంది. వైద్య, విద్య, వ్యవసాయంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. అర్హులు అందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందజేస్తోంది. కోవిడ్ వంటి విపత్తులోనూ ప్రపంచదేశాల ప్రశంసల్ని రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. మేం ఆశించిన గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే టీడీపీ ఓటమిలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. నిన్నటి నుంచి ఎల్లో మీడియాలోనూ ఇదే ప్రచారం చేస్తున్నారు. ఓటమిలో ఆనందం వెతుక్కోవటం, ఓటమిని సెలబ్రేట్‌ చేసుకోవటం కాస్త వింతగా అనిపించినా ప్రజాస్వామ్యంలో మంచిదేనేమో. పైగా ఓటమిపై టీడీపీ ప్రగల్భాలు పలకటం ఏంటి? రాష్ట్రంలో టీడీపీ వెంటిలేటర్‌ మీద ఉంది.

2. ప్రజలు తెలివైన వారు. ఎల్లో మీడియాలో ఏం రాసినా, ప్రజలు తాము ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు. 82% పంచాయితీలు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. ఏకగ్రీవాలు కలుపుకుని మొదటి విడత పంచాయితీల్లో 2637 వైయస్‌ఆర్‌సీపీకి, 508 టీడీపీ, 99 ఇతరులకు వచ్చాయి. ఇవి మావద్ద ఉన్న సమాచారమని గణాంకాల సహా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. టీవీల్లోనూ వచ్చిన లెక్కలు మా వాటికి దగ్గరదగ్గరగా ఉన్నాయి. ఇవాళ సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈనాడులోనూ అశ్వత్థామ హతః అన్నట్లు టీడీపీ ఇచ్చిన గణాంకాలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టారు. పోటెత్తిన ఓటర్లు అంటూ 81.4% ఓటేశారని ఈనాడులో హెడ్డింగ్‌ రాశారు. పైగా ప్రాణాలొడ్డి గెలిచామని దేవినేని ఉమా ప్రకటన పెట్టి 1269 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ, 918 చోట్ల టీడీపీకి వచ్చాయని ఒక పట్టిక వేసి మరీ కథనం ప్రచురించారు. ఎవరైనా అధికారికంగా వచ్చే లెక్కల్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎంతో చరిత్ర ఉన్న ఈనాడు పత్రిక సిగ్గులేకుండా ఇలా వ్యవహరించటం ఏంటి? ఫలితాలు వచ్చిన తర్వాత తాము ఏం చెప్పాలో సిగ్గేసిందేమో, దానిబదులు టీడీపీ ఇచ్చిందని చెప్పవచ్చని రాసినట్లు ఉన్నారు. వాస్తవానికి అలాంటి పట్టికలు వేయాలంటే, ఇంత స్పేస్‌ ఇన్ని లక్షల ఖరీదు అని రామోజీరావు గతంలో కామెంట్స్‌ రాసేవారు. కానీ టీడీపీ పాలసీ డెసిషన్‌ ప్రకారం ఈనాడు తీసుకున్నట్లు ఉంది. ఈనాడు ఇచ్చిన గణాంకాలు చూసి ప్రజలు నమ్ముతారేమో అన్నట్లు వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి కూడా దీటుగా పోటీ అని రాశారు.

3. చంద్రబాబు నాయుడు 38.74% పంచాయితీల్లో టీడీపీ విజయం అంటూ బిల్డప్‌ ఇస్తూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 55% విజయం అంటే ఎవ్వరూ నమ్మరేమో అని పెట్టుకోలేదేమో అని సజ్జల ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చంద్రబాబు వర్చువల్ నుంచి వాస్తవాల్లోకి రావటం లేదు. ముందు మనవాళ్లు నమ్మితే.. చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తర్వాత నేషనల్ మీడియాలో మేనేజ్‌ చేస్తే ఓ వార్త వస్తుంది. అంతే తప్ప టీడీపీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూడటం లేదు. ఎంత మీడియా మేనేజ్‌ చేసినా ఓట్లేయాల్సింది మాత్రం రాష్ట్రంలో ప్రజలే. రాష్ట్రంలోని ప్రజంతా ఛీ కొడితే.. ఇలా టీడీపీ ప్రచారం చేసుకోవటం ఏంటి?

4. అంతెందుకు టీడీపీ అగ్రనాయకులు నియోజకవర్గాల్లోనూ బొక్కబోర్లా పడింది. టెక్కలిలో (అచ్చెన్నాయుడు) లెక్కలు తీయిస్తే.. 135 పంచాయితీ స్థానాలకు 112 చోట్ల వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు, 23 చోట్ల టీడీపీ మద్దతుదారులు పంచాయితీలు కైవసం చేసుకున్నారు. తునిలో (యనమల రామకృష్ణుడు) 58లో 54 చోట్ల వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు 3 చోట్ల టీడీపీ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థి 1 చోట గెలిచారు. ఇక మైలవరంలో (దేవినేని ఉమామహేశ్వరరావు) ప్రాణాలకు ఒడ్డిపోరాడామని మీడియాతో అన్నారు. మైలవరంలో 48కు 44 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు, 3 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

5. వైయస్‌ఆర్‌సీపీకి వచ్చిన ఫలితాల లెక్కలన్నింటినీ ఫొటోలతో సహా విడుదల చేస్తాం. అప్పుడైనా బింకంగా, భీకరంగా మొహం పెట్టడానికి వీల్లేదు. ఆ మూల టెక్కలి నుంచి ఇక్కడి వరకు వచ్చిన ఫలితాలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. రాజధాని నడిబొడ్డు మైలవరంలోనూ ఈరకమైన ఫలితాలు వచ్చాయి. మిగిలిన చోట్ల కూడా ఇలాంటి ఫలితాలే ఉన్నాయి. అయినా దేవినేని ఉమా ప్రకటన కానీ చంద్రబాబు మాట్లాడింది చూస్తే.. వెనకటికి ఒకడు మీసం మెలేసి, ఉన్న గోచీ తీసి తలకు చుట్టుకున్నట్లు.. టీడీపీ నేతల తీరు ఉంది.

6. ఈ మొత్తం వ్యవహారంలో 80% పైగా వైయస్‌ఆర్‌సీపీనే క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయినా టీడీపీ నేతలు బుకాయించారు. గెలిచిన వారి మొత్తం ఫొటోలతో సహా వారు వేసుకొన్న కండువాలతో సహా వెబ్‌సైట్‌లో పెడతాం. ప్రజల ముందు పెడతాం. ఇంకా మిగిలిన దశల్లో ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ మాట్లాడుతున్నవి అవాస్తవమని చూపిస్తాం. ఇవి తప్పు అని నిరూపిస్తే మావాళ్ల మీద చర్యలు తీసుకొని తప్పును సరిచేసుకుంటాం. చంద్రబాబు ఎప్పుడైనా నిజమే అని ఒప్పుకోవాలి. చంద్రబాబు రియలైజ్‌ అయినప్పుడే ఆ అనుభవానికి కొంతైనా విలువ, మర్యాద ఉంటుంది.

7. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికారపక్షం ఇంతగా క్లీన్‌స్వీప్‌ చేసిన ఘటనలు అరుదు. పార్టీ రహిత ఎన్నికల్లో బీఫారం లేకుండా పోటీ చేసినప్పుడు రాజకీయాల్లో సంబంధాలు ఉన్నవారితో, ఏ పార్టీతో సంబంధం ఉన్నవారో పోటీ చేస్తూ ఉంటారు. పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్లు గెలిచే రోజులు గతంలో ఉండేవి. ఇప్పుడు ఏదో ఒక పార్టీవైపు ఉండేవారు వస్తున్నారు. గతంలో 60-70% అధికారపక్షానికి వచ్చేవి. కానీ ఇప్పుడు 80% దాటింది. ఇంకా అది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకు పెరుగుతుందో కారణాలు కూడా వైయస్‌ఆర్‌సీపీ వద్ద ఉన్నాయి.

8. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అధికారులను వేధింపులు చేసి, టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నిమ్మగడ్డ అడ్డంగా కోర్టులో వాదించి అధికారులను టెర్రరైజ్ చేశారు. ఎక్కడైనా అధికార పార్టీనే టెర్రరైజ్ చేశారని అధికారులు ఆరోపిస్తారు. కానీ ఇప్పుడు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డనే అధికారులను టెర్రరైజ్ చేస్తూ వచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు, మంత్రులు అధికారులకు ధైర్యం చెప్పాల్సి వచ్చింది. మీకు ఏం కాదు. మీరు భయపడొద్దని నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించండని చెప్పాం. అంతకుముందే నిమ్మగడ్డ అధికారులపై రాసిన రిమార్క్స్‌ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద, కమిషనర్‌ మీద లేఖ రాసి డీఓపీటీలో పెట్టడం వంటివి చేశారు. ఇవన్నీ ఎస్‌ఈసీ అపరిమితమైన అధికారాలని, అధికారులను శంకరగిరిమాన్యాలు పట్టిస్తామనే ప్రయత్నం నిమ్మగడ్డ చేశారు. వైయస్‌ఆర్‌సీపీకి ఆధిక్యం రాకుండా ఫెయిర్‌ గ్రౌండ్‌ ఇవ్వకుండా నిమ్మగడ్డ చేశారు. ఈ మాట అంటుంటే ఆశ్చర్యం కలుగుతున్నా ఇది నిజం. దీనికోసం నిమ్మగడ్డ అన్ని రకాలుగా వ్యవహరించారు. కోర్టులకు పోయారు. సగంలో ఆగిపోయిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆపేశారు. పంచాయితీ ఎన్నికలు తెరమీదకు తెచ్చారు. అవీ రద్దు చేస్తానని ప్రకటన చేశారు. ఏకగ్రీవాలు ఎందుకు జరుగుతాయ్ అని కూడా నిమ్మగడ్డ ప్రకటన చేశారు.

9. ఈరోజున వైయస్‌ఆర్‌సీపీ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వమైనా ఒక్కటే చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వారంలో పూర్తి అయిపోతాయన్న సమయంలో కోవిడ్ అంటూ నిమ్మగడ్డ వాటిని వాయిదా వేశారు. కోవిడ్ భారీ స్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా పంచాయితీ ఎన్నికలు తెరపైకి తెచ్చారు. ప్రత్యేకించి ప్రజలకు వ్యాక్సినేషన్‌ జరుగుతున్న ఈ సమయంలో ఎన్నికలపై అభ్యంతరం తెలిపాం తప్ప ఎన్నికలకు భయపడి మాత్రం కాదు. ఎన్నికలకు ఎప్పుడూ వైయస్‌ఆర్‌సీపీ రెడీనే. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఆరోజు ఎన్నికలకు భయపడుతున్నారని చంద్రబాబు తొడలు కొట్టారు. చంద్రబాబు తొడల్ని నిమ్మగడ్డ రమేశ్‌ కొట్టారు. కొట్టి కొట్టి వారి తొడలు వాచాయి తప్ప చివరకు వైయస్‌ఆర్‌సీపీ చెప్పినట్టే జరిగింది.

10. కోర్టు ఎన్నికలు జరపాలని చెప్పిన తర్వాత మేం ప్రశాంతంగా రంగంలో దిగాం. టీడీపీ వారే బెదిరారు. కోర్టుల్లో సక్రమంగా వ్యవహరించక ఎన్నికలు తెచ్చి పెట్టారని తెరవెనుక తెలుగుదేశం వారే మా నాయకులతో మాట్లాడారు. చివరికి తెలుగుదేశం పార్టీ మొత్తం చాప చుట్టేసింది. ఎందువల్ల ఇది జరిగిందంటే.. రాజకీయం రాజకీయంగా చూస్తూ వచ్చారు తప్ప ప్రజలకు సంబంధించిన వ్యవహారంలా చంద్రబాబు ఎప్పుడూ చూడలేదు. కానీ శ్రీ జగన్‌ గారు మాత్రం ప్రజలకు సంబంధించిన సమస్యలపైన మెరుగైన పాలనను ఇంటి వద్దకే అందించాలని చూశారు. అవినీతి లేకుండా జవాబుదారితనంతో గొప్ప పథకాలు చేపట్టి వాటిని ప్రజలకు అందించాలని చూశారు. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, స్కూల్స్ రూపురేఖలే మార్చారు. సంస్కరణలు చాలా తెచ్చి ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చారు. రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయటం వారు కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం అందించారు. వీటిని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. దీనివల్ల ఫలితాలు ఇలాగే వస్తాయి. ఇంకోరకంగా ఉంటాయని అనుకోవటం భ్రమ.

11. రాష్ట్రానికి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారే ఉండాలా? ఇంకో పార్టీ ఉండకూడదా అని చంద్రబాబు అంటున్నారు. కచ్చింగా మరో పార్టీ ఉండాలి. మీకు ఛాన్స్‌ రావాలంటే.. శ్రీ జగన్ గారి లాగానే ప్రజలకు సంబంధించిన విషయాలపైన, విధానాల్లో వాటి అమల్లో లోపాలు ఉంటే ఎత్తి చూపొచ్చు. ఏమీ లేనిది క్రియేట్ చేసి దానిమీద ఏదో ఆశిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. మిమ్మల్ని నమ్ముకుంటే నిమ్మగడ్డ రమేశ్‌ లాంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

12. ఏకగ్రీవాలు విషయంలో ఏం సాధించారు చివరకు. ప్రలోభాలు చేయకుండా కట్టడి చేసే చట్టం చేశాం. దానివల్ల పంచాయితీలకు నిజమైన నాయకులు వచ్చేలా చేస్తుంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు ఏకగ్రీవాలు అవ్వాలని చెప్పటం మంచి పిలుపు. దాన్ని అందరూ ప్రోత్సహించాలి. దానికి నామినేషన్లు ఎలా వేయించాలని విప్లవంలా చంద్రబాబు వ్యవహరించటం ఏంటి? మరోవైపు.. అనంతపురం, కడప వెళ్లి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని నిమ్మగడ్డ అనటం ఏంటి? పాకిస్తాన్‌ వెళ్లినట్లు నిమ్మగడ్డ ఈ పిలుపులు ఏంటి? నియంతృత్వ దేశంలో చెప్పినట్లు అరిగిపోయిన రికార్డులా చంద్రబాబు, నిమ్మగడ్డ చెప్పారు.

13. గతంలో 12-13% ఏకగ్రీవాలుంటే ఇప్పుడు 16% ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన వాటి వివరాలు కూడా చెబుతాం. టీడీపీ గెలిచినవి పోగా మిగిలిన చాలాచోట్ల టీడీపీ సానుభూతిపరుల డిపాజిట్లు పోయాయని చెబుతున్నారు. అవి కూడా పరిశీలిస్తాం. టీడీపీ మద్దతుదారులు ఘోరంగా దెబ్బతిన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షుడు, సింగిల్‌మ్యాన్‌ ఆర్మీ అని బిల్డప్ ఇచ్చిన నిమ్మగడ్డ ఊరు దుగ్గిరాలలోనూ 16 వార్డులకు 11 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. అక్కడ 6000 ఓట్లు పోలైతే 1160 ఓట్లతో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారు గెలిచారు. టీడీపీ వాళ్లకు కళ్లు పూర్తిగా పోయాయి. కనీసం నిమ్మగడ్డ అయినా సంయమనం పాటిస్తూ బ్యాలెన్స్‌గా ఉండాలి కదా.

14. చివరకు పంచాయితీ ఎన్నికల్లో ఏం జరిగింది. ఒకరకంగా మేలు జరిగిందనిపిస్తోంది. ఈ ఎన్నికల వ్యవహారాన్ని ఓస్థాయి మించి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్‌ చేసి, భయానికి గురి చేసి ఒత్తిడి చేశారు. అయినా వైయస్‌ఆర్‌సీపీకి రావాల్సిన ఓటు షేర్‌, వైయస్‌ఆర్‌సీపీకి రావాల్సిన పంచాయితీ పర్సంటేజీలు వచ్చాయి. పార్టీ రహితంగా జరిగినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఎక్కడెక్కడ నిలబడ్డ చోట్ల 82%పైగా గెలిచాం. టీడీపీకి 15-16% వచ్చి ఉంటాయి. చివరి గణాంకాలు వస్తే కొంచెం అటూఇటూ కావొచ్చు ఏమో.

15. వచ్చే 40 నెలల్లోనూ ఏం చేయాలో శ్రీ జగన్ గారికి క్లారిటీ ఉంది. ఈ ట్రెండ్‌ వచ్చేకొద్దీ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇప్పటికైనా చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకోవాలి. కానీ వెకిలిగా చంద్రబాబు ప్రవర్తించి ఒకరోజు ఆనందం పొందటం సరికాదు. తర్వాత రోజుకు ప్రజలు మర్చిపోతారులే అనుకునే పద్ధతి చంద్రబాబు మానుకుంటే మంచిది. వ్యవస్థలను నమ్ముకొని మనోళ్లు ఉంటారు ,వారితో చేద్దామా అన్నట్లు బాబు చేశారు. ఇవాళ ఎవరినైనా ఏదో వ్యవస్థలో పెడితే పదేళ్లలో వీడు మనకు ఎక్కడ ఉపయోగపడుతారనే లెక్కలు వేసుకొని అడ్డదారుల్లో పోవటం చంద్రబాబుకు అలవాటే.

16. చేతబడులు, బాణామతులో, నిమ్మకాయలు పెట్టి అర్థరాత్రి పూజలు చేయించటం సినిమాల్లో ఉంటాయి. ఇక్కడ లేవు.. ఉండవు. ఒకచోట కాకపోతే ఇంకోచోట ప్రజల్ని మోసం చేయవచ్చేమో. కానీ రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పాలన చూసి ప్రజలు చీత్కరించారు. ఇప్పుడు శ్రీ జగన్ పాలన చూస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు. ప్రజలకే స్వానుభవం అయింది. చంద్రబాబు మద్దతుదారులకు కూడా రాజకీయాలకు అతీతంగా మేలు చేస్తున్నారు. టీడీపీ ఓటర్లు అనుకునేవారు కూడా మాపైపు మెగ్గుచూపుతున్నారు. రాబోయే రోజుల్లోనూ అవి కూడా తీసి చూపిస్తాం. వాటిని చూసైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అవ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ఇప్పటికైనా రాజమార్గంలో వస్తే చంద్రబాబుకు, రాష్ట్రానికి మంచిది.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

17. వెన్నుపోటు అని చంద్రబాబు నోటి వెంట రావటం నవ్వొస్తోంది. మోకాలికి బట్టతలకు అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. తను చేసింది ఎదుటి వాళ్ల మీదకు వేయాలని చూస్తున్నట్లు ఉంది. వెన్నుపోటు ఎలానో చంద్రబాబే చెబితే బావుంటుంది. గతంలో చంద్రబాబు చేసింది గుర్తు ఉన్నట్లు ఉంది. అదేమిటో చంద్రబాబే చెబితే బావుంటుంది. తనే బురదలో ఉండి మిగిలిన వారు కూడా ఉన్నారనుకున్నారు. ప్రపంచం మొత్తం వెన్నుపోటుదారుడు అని ఏకైక బిరుదు ఉన్న వ్యక్తి చంద్రబాబే. ఇంకోచోట అలా జరిగే అవకాశం ఏమీ లేదు. అధికారంలో నుంచి సొంత మామను లాగేయటం, ఆస్తులు లాగేయటం కళ్ల ముందే కనిపిస్తోంది. పాత జ్ఞాపకాలన్నీ చంద్రబాబుకే గుర్తుకొస్తున్నాయ్.

– తనస్థాయికి తగ్గట్లు చంద్రబాబు మాట్లాడటం లేదు. డొల్ల ఆలోచనలతో నీచంగా వ్యవహరిస్తున్నారు. కుట్రలు తప్ప ఆయన ఒంట్లో ఏ వైరస్‌ ఉందో తెలియటం లేదు. అలాంటి వ్యక్తిని ఇక్కడే చూస్తున్నాం. అంత అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం గురించి, సమస్యల గురించి మాట్లాడాలి. రాజకీయం ఇలా ఉండాలని యువతరానికి చంద్రబాబు చెప్పాలి కానీ.. అందరూ అసహ్యించుకునేలా మాట్లాడటం ద్వారా ఇలా రాజకీయాలు చేయకూడదని బాబు వ్యవహరిస్తున్నారు. ఇంటిలో వారి గురించి మాట్లాడటం ద్వారా చంద్రబాబు తన స్థాయిని నిరూపించుకుంటున్నారు.

– అవతల వారిపైన అక్కసుతో, విచక్షణ కోల్పోయిన చంద్రబాబు మాట్లాడతారు. మర్డర్‌ జరిగితే దానివెనుక శ్రీ జగన్ ఉంటారా? ఉన్నారంటే జనం నమ్ముతారా? చంద్రబాబు స్థాయిలో ఉన్నవారు అలాంటి చౌకబారు విమర్శలు మాట్లాడకూడదు. చంద్రబాబు భాష, ఆ మాటలు తీసుకునే చౌకబారు విమర్శలు సరికాదు.