నిమ్మగడ్డ మూల్యం చెల్లించుకోక తప్పదు:అంబటి రాంబాబు

200

రాష్ట్రంలో చోటుచేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ ఎల్లో మీడియా ఒక అద్భుత‌మైన నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించడానికి ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్యంగా ఎల్లో మీడియా టీవీలు అచ్చెన్నా‌యుడు అరెస్ట్, ప‌ట్టాభి పై హ‌త్యాయత్నం, చంద్ర‌బాబు ప‌రామ‌ర్శంటూ  ఫ్లాష్.. ఫ్లాష్ న్యూస్ లు‌.. బ్రేకింగ్ లు అంటూ.. రాష్ట్రంలో ఏదో గంద‌ర‌గోళం జరిగిపోతుందనే విధంగా ప్రచారం చే‌సే ప్ర‌య‌త్నం చేశాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
ఈరోజు ఉద‌యం కూడా ఆ వర్గం మీడియా పత్రికల్లో.. దేశంపై దాడి,  నేత‌ల‌పై దాష్టీకం, ప‌ట్టాభిపై పగ, అచ్చెన్నాయుడి పై క‌క్ష.. అంటూ వార్తలను వండివార్చారు.  రాష్ట్రంలో ఏదో గంద‌ర‌గోళం జ‌రుగుతున్న‌ట్లు, ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతున్న‌ట్లు, వైయ‌స్ఆర్ సీపీ పోలీసుల్ని అడ్డుపెట్టుకుని దౌర్జ‌న్యం చేస్తుంది అనేట్లు ప్రజల్లో ఒక భ్ర‌మ క‌ల్పించ‌డానికి టీడీపీ- టీడీపీ అనుకూల మీడియా చాలా తంటాలు ప‌డ్డారు. కానీ రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో, వాస్తవాలేమిటో ప్ర‌జ‌లు చ‌క్క‌గా గ‌మనిస్తున్నారు  అన్నారు.

అచ్చెన్నాయుడుని నిన్న అరెస్ట్ చేశారు. ఇంత‌కుముందు కూడా ఆయన్ని అరెస్ట్ చేశారు.. అచ్చెన్నాయుడు నేరానికి పాల్ప‌డ్డారు అని ప్రాథమిక స‌మాచారం ఉన్న త‌రువాత మాత్ర‌మే అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో నామినేషన్ వేయనీయకుండా దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డార‌ని ప‌త్రిక‌ల్లో కూడా వ‌చ్చింది.  అచ్చెన్నాయుడు దౌర్జ‌న్యం చేశారు, బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. తన భార్య పోటీ చేస్తున్న నిమ్మాడలో ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాల‌నే కుట్ర పూరిత ఉద్ధేశంతో తన అన్న కుమారుడైన అప్ప‌ల‌నాయుడి మీద దౌర్జ‌న్యం చేసి, విర‌మింప‌చేసే ప్ర‌య‌త్నం చేసిన‌పుడు, పోలీసుల‌కు కంప్లైంట్ చేస్తే, కేసు రిజిస్టర్ చేసి, అరెస్ట్ చేశారు  అన్నారు.

ఈ రాష్ట్రానికి మంత్రులు, హోంమంత్రి అయ్యేది ఆయా డిపార్ట్ మెంట్ లో ఉండే వారి తాట‌లు తీయ‌డానికా? అని అచ్చెన్నాయుడిని, చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. అధికారం వస్తుంది అని.. చంద్ర‌బాబు దేశానికి ప్ర‌ధాన‌మంత్రి అని, లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అని,  ఈయన హోంమంత్రి అని, నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ పంచాయ‌తీరాజ్ మంత్రి అని అచ్చెన్నాయుడు ప‌గ‌టి క‌ల‌లు కంటూ, గాలి మేడ‌లు క‌డుతున్నారు. ఇది జ‌రిగే ప‌ని కాదు.  మీరు తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం క‌ల్ల‌.. అధికారంలోకి వస్తామ‌ని బెదిరించి, ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేస్తే ఎవ‌రూ న‌మ్మ‌రు  అన్నారు.

మరో ఘటనలో టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి మీద దాడి జ‌రిగిందంటా.. సాక్ష‌ాత్తూ చంద్ర‌బాబు పరామర్శించారు. ఇంత‌కుముందు కూడా అదే వ్యక్తిపై అర్ధరాత్రి దాడి జ‌రిగింది. కారు అద్దాలు ప‌గ‌లుకొట్టి ధ్వంసం చేశారని హడావుడి చేశారు.. ఇప్పుడు కూడా దాడి జ‌రిగింది, కారు అద్దం ప‌గిలింది.. రెండు సార్లు కారే ధ్వంసం అయ్యింది కానీ, ఏం కాలేదు.. బ‌హుశా ఇన్సూరెన్స్ గొడ‌వ ఏమైనా ఉందేమో.. అందుకేనేమో ఎప్పుడు దాడి జరిగినా కార్లే ధ్వంసం అవుతున్నాయి.  దాడులు జ‌రగడం త‌ప్పు, ఎవ‌రి మీద ఎవ‌రు దాడి చేసినా వైయ‌స్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అది టీడీపీ అధ్య‌క్షుడి మీద జ‌రిగినా, అధికార ప్ర‌తినిధి మీద జ‌రిగినా ఖండించాల్సిందే  అన్నారు.

దాడి జ‌రిగిందా? లేదా? ఎవ‌రు చేశారు? ఏ స్థాయిలో జ‌రిగింది?  అనేది ఇన్వెస్టిగేష‌న్ లో తేలుతుంది. కంప్లైంట్ ఇవ్వ‌మంటే ముఖ్యమంత్రిగారి ఇంటికి వెళ్తాం అంటున్నారు. దాడి జ‌రిగితే, కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేస్తారు. పోలీసుల మీద న‌మ్మ‌కం లేక‌పోతే కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చు.. అలా కాకుండా ముఖ్య‌మంత్రి ఇంటికి వెళ్తాం, ఇది వైయ‌స్ఆర్ సీపీ వారే చేశారంటే చూస్తూ ఊరుకోం  అన్నారు.

చంద్ర‌బాబు వ‌చ్చే దాక ప‌ట్టాభి ఆవేశంగా టీవీలలో మాట్లాడుతున్నాడు. ఆయ‌న రాగానే హఠాత్తుగా ప‌డుకునే సీన్ పె‌ట్టాడు, చంద్ర‌బాబు ప‌ల‌క‌రిస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తే.. ఆయన్ని మ‌ర‌పించే విధంగా చంద్ర‌బాబు యాక్ట్ చేశారు. తేడా ఏంటంటే ఎన్టీఆర్ సీన్ కు అనుగుణంగా యాక్ట్ చేస్తే, చంద్ర‌బాబు సీన్ కు మించిపోయి న‌టించారు. పట్టాభి మీద దాడి జ‌రిగితే.. చంపేస్తారా? న‌న్ను కూడా చంపండి.. అంటున్నాడు చంద్ర‌బాబు. రాజకీయంగా చ‌చ్చిన పామును చంపాల్సిన అవ‌స‌రం ఎవరికి మాత్రం ఉంటుంది. మొన్న ఎన్నిక‌ల్లో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయింది. ఆఖరికి చంద్రబాబు కొడుకును కూడా మంగళగిరిలో ఓడించారు.. రాజకీయంగా చ‌చ్చిన పాము చంద్ర‌బాబు. అయినా ఏదో విధంగా సానుభూతితో ల‌బ్ది పొందాలని, గంద‌ర‌గోళం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు  అన్నారు.

నిమ్మాడ‌లో ఏక‌గ్రీవంగా ఎన్నిక జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌ట్టి బ‌ల‌వంతంగా ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించిన అచ్చెన్నాయుడి మీద యాక్ష‌న్ తీసుకుంటే త‌ప్పేంటి?  దీనిపై ఎన్నిక‌ల క‌మిష‌నర్ ఎందుకు మాట్లాడ‌రు.? ‌అచ్చెన్నాయుడు దౌర్జన్యం చేస్తే..  ఎన్నిక‌ల క‌మిష‌నర్ మాట్లాడ‌రా? నిష్ప‌క్ష‌పాతంగా ఉండాల్సిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పక్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం అని ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి  అన్నారు.

టీడీపీ ఆఫీసులో తయారైన యాప్ నే ఎస్ఈసీ నిమ్మగడ్డ రిలీజ్ చేశారు
మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ..
–  ఎస్ఈసీ నిమ్మగడ్డ యాప్ అంతా ఒట్టి బూట‌కం.. ఇది వ‌ర‌కు చంద్ర‌బాబు ఆఫీస్ లో ఒక‌ లెట‌ర్ త‌యారైతే దానిపై నిమ్మ‌గ‌డ్డ సంత‌కం పెట్టి కేంద్రం హోం సెక్ర‌ట‌రీకి ఏ విధంగా పంపించారో.. అదేవిధంగా, ఈ యాప్ టీడీపీ ఆఫీస్ లో త‌యారు చేయించి ఇవాళ ఎన్నిక‌ల క‌మిష‌నర్ రిలీజ్ చేశారు. టీడీపీకి, ఎన్నిక‌ల క‌మిష‌నర్ కు తేడా లేదు, ఇద్దరూ క‌లిసి పని చేస్తున్నారు. ఏదో ఒక విధంగా టీడీపీని, టీడీపీ అభిమానుల‌ను గెలిపించాల‌నే తాప‌త్ర‌యంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్  ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నిపిస్తోంది. దానిలో భాగ‌మే ఈ యాప్.. యాప్ ను న‌మ్మాల్సిన అవ‌స‌రం లేదు.

–  ప్ర‌జ‌లు కోరుకున్న‌పుడు మాత్ర‌మే ఏక‌గ్రీవాలు అవుతాయి.. ఏకగ్రీవాలు అయిన గ్రామాల్లో ప్ర‌జ‌ల్ని అభినందించాలి.. అంద‌రూ క‌లిసి పోటీ లేకుండా ఒక సర్పంచ్ ను ఎన్నుకున్నారంటే అది శుభ‌ప‌రిణామం, చాలా ఆనంద‌క‌ర‌మైన ప‌రిణామం, అటువంటి వాటిని ఎవరైనా ఎంకరేజ్ చేయాలి. అంతేకాని పోటీత‌త్వం కావాలి, అంద‌రూ పోటీప‌డాల‌ని ఎలక్ష‌న్ క‌మిష‌న్ మాట్లాడుతుంది. ఈ విధంగా ఎలక్ష‌న్ కమిషనర్ మాట్లాడ‌డం రాష్ట్రంలో దుర‌దృష్టక‌ర‌మైన ప‌రిణామం, దేశంలోనే విచిత్ర‌‌మైన ప‌రిణామం..

–  ఏక‌గ్రీవాలు ఎక్కువైతే యంత్రాంగం విఫ‌ల‌మైన‌ట్టు అని ఎస్ఈసీ మాట్లాడుతున్నారు.. కానే కాదు ప్ర‌జ‌లు ఏక‌గ్రీవాలు కోరుకున్న‌పుడు ఏక‌గ్రీవాలు అవుతాయి, పోటీ కావాల‌నుకుంటే పోటీ అవుతాయి. ఏక‌గ్రీవాలు చేయాల‌ని అచ్చెన్నాయుడిలా బలవంతంగా, దౌర్జన్యకరంగా చేస్తే త‌ప్పు కానీ అంద‌రూ క‌లిసి ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే త‌ప్పేముంది.. కాబ‌ట్టి ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హించాల్సిందే..

ఎస్ఈసీ మీద మీరు ఏ విధంగా స‌భాహ‌క్కులు నోటీసులు ఇస్తారని, ఎస్ఈసీ అన్నది మా జేబు సంస్థ అనేలా టీడీపీ వైఖ‌రి ఉంది. శాస‌‌న‌స‌భ‌కు, ప్రివిలేజ్ క‌మిటీకి ఎస్ఈసీ మీద కూడా యాక్ష‌న్ తీసుకునే రైట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులు చాలా చూశాం. ఎలక్ష‌న్ క‌మిష‌న్ ను కూడా బోన్ లో పెట్టి ప్ర‌శ్నించారు.. శాస‌‌న‌స‌భ్యుడికి, మంత్రుల‌కు స‌భాహ‌క్కులుంటాయి.  ఆ హ‌క్కుల‌కు భంగం క‌లిగిస్తే విచారించే హ‌క్కు శాస‌న స‌భకు ఉంటుంది.  స‌భా హ‌క్కుల‌ విష‌యంలో శాస‌నస‌భ సుప్రీమ్.. శాస‌న స‌భ‌దే తుది నిర్ణ‌యం. వారి హ‌క్కులకు భంగం క‌లిగించే విధంగా ప్ర‌వ‌ర్తిస్తే చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు శాస‌న స‌భ‌కు, ప్రివిలేజ్ క‌మిటీకి ఉంటుంది..

– తనకు అధికారం లేకపోయినా.. ఇద్దరు ఐఏఎస్ లను ఎన్నిక‌ల క‌మిష‌నర్ ఎందుకు సెన్సూర్ చేశారు.. త‌రువాత ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నామంటున్నారు.. ఎలక్ష‌న్ క‌మిష‌న్  విధులు ఏంటి? క‌క్ష సాధింపు దోర‌ణి అనేది ఎలెక్ష‌న్ క‌మిష‌న్ ద‌గ్గ‌ర క‌నిపిస్తోంది. ఇలాంటి చాలా త‌ప్పులు స‌రిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం రెండు మూడు వారాల్లో రాబోతుంది.

– ఆయ‌న చేసేవ‌న్ని త‌ప్పే.. ఎన్నిక‌ల క‌మిషన్ త‌ప్పులు మీద త‌ప్పులు చేసుకుంటూ వెళ్తుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత కూడా మూల్యం చెల్లించ‌ుకోక త‌ప్ప‌దు.. నిష్ఫ‌క్ష‌పాతంగా ఉండాల్సి న రాజ్యాంగ వ్య‌వ‌స్థ ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు దీని సంగ‌తి తేలుస్తారు.