ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలి: పాటిబండ్ల రామకృష్ణ

211

పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మరియు బిజెపి నేతలు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ చంద్రశేఖర రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ…
పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఓటరు జాబితా అందుబాటులో లేదని ఫిర్యాదు చేశారు. . తక్షణమే ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి  చేశారు.
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్న అనేక గ్రామాలలో ముఖ్యమంత్రి ఫొటోతో ఉన్న బ్యానర్లు బోర్డులు ఇంకా దర్శనమిస్తున్నాయి  ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం  అన్నారు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్న బ్యానర్లు బోర్డులను తక్షణమే తొలగించేలా చర్యలు చేపట్టాలి. అనేక గ్రామాలలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు నామినేషన్ వేసిన అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం  అన్నారు ఎన్నికల ని వాళ్ళకి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలి. ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిపించాలని బీజేపి జిల్లా శాఖ కోరుచున్నది  అన్నారు ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇంచార్జి సురేందర్ రెడ్డి,మాజీమంత్రి శనక్కాయల అరుణ, కాయితి సైదారెడ్డి, కుమార్ గౌడ్, రాచుమల్లు భాస్కర్, ఆవుల నాగేంద్ర యాదవ్, కాటూరి శ్రీనివాసరావు, వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు