ఏడు కొండలు – ఏడు జాతీయరహదార్లు – ఏడు రాష్ట్రాలు70 వేల కోట్లు

448

2004-2014 UPA  ప్రభుత్వం లో, దాదాపు 70,000 కోట్లు ఖర్చుతో, 7 జాతీయరహదార్లు, 7 రాష్ట్రాలను కలుపుతూ, 7 కొండల తిరుపతికి  నిశబ్దంగా తీసుకొని రావడం, ఇది తిరుపతి చరిత్రలో UPA ప్రభుత్వంలో ఒక బంగారు శకం అని  కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలియజేశారు.

ఏడు రాష్ట్రాలు, ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, తెలంగాణా, మహరాష్ట్రాలు కలుపుతూ, తిరుపతి- చెన్నై NH 205 -130 km,  తిరుపతి – కొచ్చిన్  NH 544 -666 km , తిరుపతి-బెంగళూరు NH(140,69,75) ,254 km తిరుపతి- హైదరబాద్ NH 44 వయా కడప, కర్నూలు 555 km తిరుపతి- అనంతపుర్ NH71, 279 KM , తిరుపతి- మహరాష్ట్ర NH 565, 1052 KM , తిరుపతి- నాయుడుపేట, NH 71 -65 KM  శాంక్షన్ చేయడం దాదాపు 3500 KM పూర్తి చేయడం గమనార్హం అన్నారు.

ఇంతే కాకుండా UPA పాలనలో 7 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా శాంక్షన్ కాబడినవి అని చింతామోహన్ చెప్పారు.
1. మన్నవరం  BHEL, NTPC ప్రాజెక్టు
2. అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతి
3. దుగరాజపట్టణ ఓడ రేవు.
4. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
5. ఆరోగ్య పరంగా, స్విమ్స్ అభివృద్ధి, చిన్న పిల్లల ఆసుపత్రి, 300 పడకల గర్బవతుల ఆసుపత్రి, పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ, 200 సీట్లు ఇవన్ని UPA ప్రభుత్వంలో వచ్చినవే
6.  కాళహస్తి – నడికుడి రైల్వే ప్రాజెక్టు
7. గూడురు- కాట్పాడి  double line, broad guage  దాదాపు 40 క్రొత్త  trains, తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి, UPA ప్రభుత్వంలో జరిగినవే  అని గుర్తు చేశారు.

ఇవి కాకుండా తిరుపతి  slum  క్లియరెన్సు క్రింద 41 కాలనీల అభివృద్ధి, 2 బెడ్ రూముల ఇండ్లు 7008 మంది నిరుపేద మహిళలకు  ఒక్కొకరికి 4 లక్షల చొప్పున, 292 కోట్లు, నిదుల విడుదల. జయరాం రమేష్  చేతుల మీదుగా పునాదిరాయి,  ప్రముఖ దేవాలయాలను చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కలుపుతూ, 47 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ,  ప్రతి గ్రామనికి విద్యుత్ లైట్లు 2 లక్షల చోప్పున  MPLADS  క్రింద శాంక్షన్ చేయడం,  NDA  ప్రభుత్వంలో తిరుపతికి గాని ఆంధ్రప్రదేశ్ కు గాని  ఈ budget  లో ఏమి చేయకపోగా వచ్చిన ప్రాజెక్టులను ఆపడం NDA  ప్రభుత్వం తీసుకున్న చొరవ గమనార్హం అన్నారు.

MGNREGA, మద్యాహ్న భోజనం, ICDS  జాతీయ ప్రోగ్రాంలకు నిధులు తగ్గింపు.  LIC లాంటి సంస్ధలను ప్రైవేటికరణ, గిట్టుబాటు ధర గూర్చి రైతులను గూర్చి 70 రోజులుగా, దీక్షలు చేస్తున్న అన్నదాతలు, రైతాంగ గూర్చి, మాట్లాడకపోవడం భాధకరమని అటువంటి BJP NDA ప్రభుత్వాలను  YCP& TDP సపోర్టు చేయడం విడ్డూరంగా వుందని విమర్శించారు. మరి ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా  పోలవరం ప్రాజెక్టుకు  నిదులు, 35 లక్షల కోట్ల కెంద్ర బడ్జెట్ లో  35 కోట్లు ప్రాజెక్టు ఇవ్వలేదని చింతామోహన్ చెప్పారు.