“సెన్సేషనల్ విక్టరీ” వీరులు… !

223

తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్ లో ఎగిసిపడుతున్న సమయంలో (2012) పాలమూరు( మహబూబ్  నగర్) ఎమ్మెల్యే రాజేశ్వరన్న అకాల మరణం చెందారు. దీంతో పాలమూరు జిల్లా కేంద్రంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సందర్భంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా పాలమూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని లెక్కకు మించిన కుయుక్తులకు తెర తీసింది.

అంతేకాదు… అప్పుడు పాలమూరు ఎంపీగా ఉన్న, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఎలాగైనా టి ఆర్ ఎస్ ను గెలిపించి, పరువు కాపాడుకోవాలని ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు.( విజయమే పరమావధిగా అస్త్ర శాస్త్రాలు ఉపయోగించారు)
ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ  అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు కిషనన్న ప్రచారంలో భాగంగా పాలమూరులో పర్యటించారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ కి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పట్టారు. దీంతో దిక్కుతోచని అధికార పార్టీ కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు కలిసి బిజెపిని నేరుగా ఎదుర్కోలేక పోయారు. ఎలాగోలా దొంగ దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఓ కేసులో ఇరికించారు.  రాత్రివేళ  ప్రచార సమయం ముగిసి పోయినా..  భారతీయ జనతా పార్టీ వాళ్లు అదే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు అని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.   ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు  నాగూరావు నామాజీ,  పాలమూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కె రాములు, జిల్లా నాయకులు  పడాకుల బాల్రాజ్, పడాకుల సత్యం, యువ నాయకులు మున్నూరు రవి, మహేష్ ల మీద కుట్రలు పన్ని కేసు నమోదు చేశారు.
అయినా కూడా  పాలమూరు పట్టణ ప్రజలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి బిజెపి కి అండగా నిలిచారు. ఇది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే “సెన్సేషనల్ విక్టరీ ”

ఆ కేసు ఈ విషయంలో  ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో ( నేను వారికి జామీను( షూరిటీ) ఇచ్చాను.) నాటి  స్మృతులను నెమరు వేసుకున్నాము.

                                                                                                            – బాలస్వామి