ఇప్పుడు తోబుట్టువులంటే ఒక బరువు!

427

తోబుట్టువులంటే ఇప్పుడు ఒక బరువులా భావిస్తున్నారు . పిల్లలుగా ఉన్నప్పుడు కలిసి ఉంటాం
పెళ్లి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోరు.

ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు
అక్కా నీ మరదల్ని తీసుకుని వస్తున్నాను అని!
సంతోషంతో పొంగిపోయిన అక్కా
ఇల్లంతా వెతికింది వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.
పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు.
రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి.
రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది.

బెల్ మోగింది. తమ్ముడు వచేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావాడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది
అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.

వంట గదిలోకి వెళ్ళింది
రెండు గ్లాసులో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది
మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఇచ్చింది తమ్ముడి ముందు నీళ్ళ గ్లాసు ఉంచింది.
తమ్ముడికి 7up ఇష్టం అని చెబుతూ..
తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.
ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు.
అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి,వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కింద పడేసాడు.
అయ్యో ఏంటని అందరూ అడిగితే.. జ్యూస్ ఒలికింది నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు అంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.
ఇక వెళ్ళొస్తామంటూ బయల్దేరేసారు.
తమ్ముడు అక్కదగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని,  అక్కా జాగ్రత్త వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి అని, చేతిలో భార్యకు అత్తగారికి కనిపించకుండా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టాడు.
అక్క కష్టాన్ని కాస్త పంచుకుంటూ సోదరులంటే ఇలా ఉండాలి కదా.
బంధం అనే కాదు…కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారినీ కష్టాల నుండి బయటపడే సహాయం ప్రయత్నం చేయాలి.