ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుంది:పద్మారావు గౌడ్ 

292

సికింద్రాబాద్ : ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని తెలంగాణా శాసనసభ ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.  తెలంగాణా ఎన్ జీ ఓ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చంద్రశేఖర్ నేతృత్వం లో తెలంగాణా VROల సంఘం సభ్యులు బుధవారం సితాఫలమండీలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు తో సమావేశమయ్యారు. తమ సమస్యల పై ఓ వినతి పత్రాన్ని అందించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిసున్న వీ ఆర్ ఓ ల సమస్యలను పద్మారావు గౌడ్ కు విపులీకరించారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ఆయా అంశాలపై ఇతర  ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.తెలంగాణా వీ ఆర్ ఓ ల సంఘం నేతలు సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.