ట్రైబల్ ట్రైనీ ఉద్యోగులను తొలగించడం అన్యాయం:సిఐటియు

408

ఏపీఎండీసీ  లో పని చేస్తున్నా, 176 మంది ని,వైజాగ్ ట్రైబల్  ట్రైనీ లను, తొలగించాలని, ఏపీఎండీసీ యాజమాన్యం, బోర్డులో ప్రతిపాదన చేయడం, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు అనుబంధం, గౌరవ అధ్యక్షులు   సిహెచ్ .చంద్రశేఖర్, తీవ్రంగా ఖండించారు. బాక్సైట్ కోసం,   ఏపీఎండీసీ లో, 16 సంవత్సరాలు  గా, ట్రైనింగ్  పేరుతో, వివిధ ఉద్యోగాల పనిచేస్తున్నారని,  ఒక్క కలం పోటుతో తొలగించడం దుర్మార్గం, అన్యాయమని, విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు.

వచ్చిన పాలకవర్గాలు అన్నీ కూడా అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారని  ఆరోపించారు. వారి యొక్క కుటుంబాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. హెచ్ ఆర్ సెక్షన్ అధికారులు నోట్ ఫైల్ బోర్డు మీటింగ్ లో ఏం పెట్టారో బహిరంగ  పరచాలి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి  గారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరూ రెగ్యులర్ చేస్తానని మాట చెప్పి,  గత ప్రభుత్వంలో  తెచ్చుకున్న ఉద్యోగాలను,నేడు ఉద్యోగాలు తొలగిస్తున్నారని. ఇది ఉద్యోగాలిచ్చే  ప్రభుత్వమా, తొలగించే ప్రభుత్వ మా  అని ప్రశ్నించారు.  ఎండి గా పనిచేసిన  ఐఏఎస్. హరి నారాయణ, ఉద్యోగాలు అదనంగా ఉన్నాయని చెప్పి .ముఖ్యమంత్రి బంధువుల చెప్పినారు అని, మంగంపేటలో, ఒకే కుటుంబంలో   భార్య భర్తల కి ఎలా  ఉద్యోగాలు,ఇచ్చారని ప్రశ్నించారు.  ఏపీఎండీసీ లో  అవినీతిని అరికట్టే లే క, ఏపీఎండీసీ ని  దివాలా తీస్తున్నారు అన్నారు.

ఏపీఎండీసీ లో అదనంగా ఉన్నారని 450 మంది ని తొలగిస్తున్నారని సి ఐ టి యు ముందే హెచ్చరిక చేసిందని, గుర్తు చేశారు. త్వరలో మంగంపేట లోనూ ఉద్యోగుల తొలగించి, ప్రైవేట్ కార్పొరేట్లకు లాభాలు వచ్చే ఏపీఎండీసీ సంస్థానం కట్టబెడుతున్నారని హెచ్చరించారు. పోరాడే సంఘాన్ని   బలహీనపరచడం  వల్లనేటి పరిస్థితి అన్నారు.  హైకోర్టు, సుప్రీంకోర్టులో, ఏపీఎండీసీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు చెప్పిన, యాజమాన్యం అమలు చేయలేదన్నారు. మంగంపేటలో కార్మికులను, పునరావాస యాక్ట్ ప్రకారం రెగ్యులర్ చేయాల్సి ఉండగా, ఉన్నవారిని తొలగించేందుకు యాజమాన్యం కుట్రపన్నుతోందని హెచ్చరించారు. రాజకీయాలు కు, కులాలు మతాలకు అతీతంగా కార్మికులు   ఐక్య పోరాటం చేయాలని  చంద్రశేఖర్ పిలుపునిచ్చారు, కార్మికులు చేస్తున్న పోరాటానికి  సి ఐ టి యు  సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు.   సి ఐ టి యు. జిల్లా ఉపాధ్యక్షులు ఏ.  రామ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.