బిజెపి వ్యూహాలు ఎవ్వరికీ అంతుపట్టవు

500

ఒకసారి ఒక పెళ్ళి లో ఇష్టాగోష్టి గా మాట్లాడుతూ ఉండగా, మా దగ్గరి బంధువు చాలా సీనియర్ జర్నలిస్ట్ (ఇప్పుడు Octogenarian) అన్నమాటలవి…

రైతు చట్టాలు నిజానికి పూర్తిగా రైతులకు మేలు చేసేవే అని :
రాహుల్ గాంధీ కి తెలుసు,
శరద్ పవార్ కు తెలుసు,
ప్రకాష్ సింగ్ బాదల్ కు తెలుసు,
కేజ్రీవాల్ కు తెలుసు, ఇంకా
మమత కు, అఖిలేష్ కు, స్టాలిన్ కు,
ఏచూరి కి, డి రాజా కు, పినరై కు..
ఇలా అందరికి తెలుసు.

“మరి ఎందుకీ గోల? ”
మోడీజీ ఈ చట్టాలు ఇప్పుడే ఎందుకు ముందుకు తీసుకొచ్చినట్టు? అంత మంచి చట్టాలైతే రాబోయే 2024 లోకసభ ఎన్నికల ముందు ఈ పని చేయవచ్చుగా!

విషయం తాజాగా ఉండి Vote Share ఇబ్బడి ముబ్బడిగా పెంచుకొనే వీలుండేదిగా!

అక్కడే ఉంది కిటుకు.
ఓ పక్క రైతులకు లబ్ది చేకూరుస్తూనే –
మరో పక్క కొందరికి తమ కరెక్ట్ స్థానాన్ని చూపించడం – ఈ బిల్లుల / చట్టాల ఉద్దేశం.

కనుక ఆ “Damage” పొందే శక్తులు తప్పకుండా వీలైనంత తీవ్రంగా అల్లర్లు లేపుతారని ముందే తెలుసు.
WB సింగూర్ లో Tata కార్ల ప్రాజెక్ట్ విషయం లో ఏం జరిగిందో బిజెపి నాయకులకు బాగా తెలుసు.

ఎన్నికలకు ఇంకా 3 1/2 సంవత్సరాల సమయం ఉంది. ఈ లోగా ఎంత అల్లర్లు లేపినా…
2024 వరకు సమ్మె కొనసాగుతుంది అని వాళ్ళ ప్రణాళికాబద్ధమైన దురుద్దేశాన్ని Tongue Slip తో బయట పెట్టినా….
ఈ సమ్మె అనేది ఎక్కువ కాలం కొనసాగదు.

కొంతమంది సుప్రీం కోర్ట్ కు వెళతారని కూడా తెలుసు.
సుప్రీం కోర్ట్  కు చట్టాల్లో వ్రాతపూర్వకంగా ఉన్నవాటి అర్థం & వ్రాతల్లో లేనివాటి అర్థం, ఉద్దేశం బాగా తెలుసు.

అయినా వెంటనే తీర్పు ఇస్తే, అందులో కూడా పార్టీ పక్షపాతం అంటగట్టే ప్రమాదం ఉంది కనుక వారు కూడా నిదానం గానే ముందుకు వెళ్తున్నారు.

SC తీర్పు తో సంబంధం లేకుండా –
ఈ చట్టాల ద్వారా మూడున్నర ఏళ్లలో  ఎంత లాభపడతారో రైతులకు ప్రత్యక్షంగా తెలుస్తుంది.
అప్పుడు ఈ చట్టాలు చాలా మంచివి అని బిజెపి గానీ, అలయన్స్ భాగస్థులు గానీ, నిజాయితీ తో పనిచేసే కొంతభాగం మీడియా గానీ ప్రచారం చేసే అవసరం ఉండదు.
బిజెపి కి రావాల్సిన లాభం తనంతట తానే వస్తుంది.
ఇక ఈ చట్టాలను ఇప్పుడే అంటే బిజెపి ఎజెండా లోని మిగతా అంశాలకంటే ముందుగానే  చేపట్టటానికి కారణం.

ఇంకా ముఖ్యమైన చట్టాలు,
ఉన్న చట్టాలకు, రాజ్యాంగానికి సవరణలు ముందుకు తెచ్చినప్పుడు ఎవరి స్పందన ఎలా ఉంటుందో అధ్యయనం చేయడం.

వాటి గురించి తర్వాత చర్చిద్దాం. ఎలాగూ అప్పుడు వాటిపై చర్చ ఉంటుంది.

“మరి ఎందుకీ గోల?” అని పైన అనుకొన్నాం కదా!
గోల ఏల అంటే – అది రైతులపై టన్నులకొద్దీ కారుతున్న ప్రేమ కాదు.

నేను విభిన్న ఫోరమ్ లలో తరచుగా అడుగుతున్నాను చట్టాలపై ఒంటికాలిపై లేస్తున్నవారు ఒక్కరంటే ఒక్కరూ జవాబు చెప్పలేదు.

Repeat :
(1) రైతు చట్టాలలోని ఏ భాగం, లేదా భాగాల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది?
(2) Penultimate  దఫా చర్చల్లోనూ, అంతకముందు దఫా లోనూ “క్లాజ్ వైజ్ చర్చిద్దాం”  అంటే ఈ రైతు నాయకులం అని చెప్పుకొనేవాళ్ళు నిర్ద్వంద్వంగా ఎందుకు తిరస్కరించారు?
ఠాట్, మొత్తానికి చట్టాలకు చట్టాలే రద్దుచేయాలి అని చిన్న పిల్లల లాగా ఎందుకు మొండికేశారు?
ఎందుకంటే రైతులకు కలిగే లాభనష్టాలతో వాళ్లకు సంబంధం లేదు.
వీటివల్ల ఈ క్రింది కేటగిరీ ల అక్రమరాయుళ్ల పరిస్థితి తల క్రిందులౌతుంది.

(1)ఏ కుటుంబ ప్రమేయం లేకుండా పంజాబ్ లో ఒక్క గింజ కూడా  క్రయావిక్రయాలు పొందదో, ఆ P S బాదల్ సాలుకు పదివేల కోట్లు ఉష్ కాకీ అయిపోతుంది.

(2) వ్యవసాయం అంటే ఏమిటో తెలియని సుప్రియా సూలే (D/o. శరద్ పవార్ ) సంవత్సర “వ్యవసాయ” ఆదాయం ఐదు వేల కోట్లు హుష్ మటాష్  అవుతుంది.

(3)కష్ట పడి మట్టి పిసుక్కుని పండించే అమాయక రైతుల వద్ద నూటికి మూడు అని పిండుకొనే, మండీలలో ప్రభుత్వ ఉద్యోగుల “కష్టార్జితం” కనబడకుండా మాయమౌతుంది
(4)నిన్నటి వరకు మనదేశంలో పండే పప్పుధాన్యాలు 3 మిలియన్ టన్నులు.
దేశావసరాలు 26 మిలియన్ టన్నులు.
మిగతా 23 మి. టన్నులు కెనడా నుండి దిగుమతి.

ఇతర దేశాలనుండి కూడా దిగుమతులు ఉన్నప్పటికీ 99% కెనడా నుండి.
అక్కడ వ్యవసాయం ను డామినేట్ చేసేది సిక్కులు.
అక్కడి ప్రభుత్వం మీద కూడా బలంగా ప్రభావం చూపగలిగిన వారు.

ఇప్పుడు మోడీజీ ప్రభుత్వం, మనం  అన్ని రంగాల్లో Self Reliance సాధించాలి అనే ఉన్నతమైన ఆశయం తో ప్రారంభించిన ప్రణాళిక వలన మన దగ్గరే మన అవసరాలకు సరిపోయేటన్ని పప్పుధాన్యాలు పండే పరిస్థితి వచ్చింది.

అలాగైతే మరి కెనడా లో ఈ 23 మి. టన్నులు పండించే వాళ్లకు “కోపం” రాదా?
అక్కడ కెనడా లో సిక్కు రైతులు,
ఇక్కడ బాదల్ కుటుంబం.
అక్కడా ఇక్కడా ఖలిస్థాన్ వాదులు –
ఈ మూడు కేటగిరీలు కలిస్తే ఎలా ఉంటుంది?

వారికి అనాలోచితంగానో –
దురుద్దేశం తోనో మద్దతునిచ్చే కాంగ్రెస్ & కమ్యూనిస్ట్ లు,
మన దేశం లో Unrest లేపాలని సదా ప్రయత్నం చేసే చైనా, పాకిస్థాన్ ప్రభుత్వం + పాక్ టెర్రరిస్ట్ లు….

వీళ్లంతా ఒకటైతే ఎలా ఉంటుంది?
ఇంకా అయిపోలేదు.

(5) ఇక PAN – Permanent Account Number (of Income Tax ):
ఈ రైతు చట్టాల అమలులో PAN చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది.
దీని వలన రైతులకు వచ్చే నష్టమేం లేకపోగా పరోక్షంగా లాభం ఉంటుంది.
రైతు తన ఉత్పత్తులు అమ్మినప్పుడు పొందే రసీదు పైన కొనుగోలుదారు తప్పనిసరిగా PAN చూపించాలి.
తద్వారా ఒక ఎన్నుకొన్న కాలం లో అతను
*ఎంత మేరకు లావాదేవీలు చేసాడు
* ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాడు
* ఎంతకు కొన్న వస్తువును ఎంతకు అమ్మాడు,
మొదలైన సమాచారం ప్రభుత్వం దగ్గరికి చేరిపోతూ ఉంటుంది.
తద్వారా అడ్డగోలుగా అమ్ముకొనే అవకాశం అతనికి ఉండదు కాబట్టి, వినియోగదారుని దాకా వచ్చేదాకా ధరలు తప్పకుండా నియంత్రణలో ఉంటాయి.
తన దగ్గర ఒక్క రూపాయికి కొని వినియోగదారునికి నాలుగు రూపాయలకు అమ్మే పరిస్థితి ఉండదు కనుక రైతుకు ఆనందమేగా!
ఇదే అక్రమవ్యాపారులకు నచ్చని విషయం.
అందుకే చట్టాలలోని ప్రతికూల అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించడం కాకుండా మొత్తం చట్టాలే రద్దు చేయాలి అని కోరేది అందుకే.

ఓ పక్క ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనకు తీవ్రమైన అపకారం చేయాలని చూసే పాకిస్తాన్, చైనా, ఖలిస్థాన్ వాదులు, పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు.

ఇంకొక పక్క అత్యంత ధనవంతులైన కెనడా సిక్కు రైతులు; మరోపక్క
(1) అక్రమ ఆదాయం కోల్పోతున్న సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులు
(2) గోల్ మాల్ వ్యాపారాల ద్వారా అవధులు లేని అక్రమ ఆదాయం పొందుతున్న వ్యాపారులు
(3)సాలుకు 10,000 కోట్లు కోల్పోతున్న బాదల్ కుటుంబం
(4) సాలుకు 5,000 కోట్లు మటాష్ అవుతున్న పవార్
కుటుంబం
(5) వీళ్లందరికి తోడు దేశహితం కాకుండా తమ తక్షణ లాభమే చూసుకొని బిజెపిని ఇబ్బంది పెట్టాలని చూసే కాంగ్రెస్+ & కమ్యూనిస్ట్ లు.

అయితే లక్ష రకాల తపస్సులు చేసినా వీళ్ళు సాధించేది శూన్యం.
ఏది ఏమిటో అందరూ గమనిస్తున్నారు – అందరికి నిజాలు తెలుసు.
రైతు చట్టాలు రైతుల ఆదాయం పెంచి &
బీజేపీ+ కూటమికి 5% ఓట్లు పెంచే ఒక గొప్ప పథకం.
.                                                                –    డి.వి.ఆర్.చారి