మరిన్ని ఆధారాలు,వీడియోలు పంపించాలని ఆదేశించిన అమిత్ షా

0
185

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలపై, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేసారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమిత్ షా అప్పాయింట్మెంట్ కేటాయించినప్పటికీ, రైతుల సమస్య పై ప్రధాని మోడీతో జిరిగిన సమావేశం లేట్ అవ్వటంతో, టిడిపి ఎంపీలతో భేటీ ఆలస్యం అయ్యింది. టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల అమిత్ షాని కలిసారు. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో లేకపోవటంతో, ఈ భేటీకి రాలేదు. మొత్తంగా 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.

టిడిపి ఎంపీలు అమిత్ షా తో భేటీ అయ్యి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పై ఆధారాలతో ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా దేవాలయాల పై ఘటనలు, రాజ్యాంగ సంస్థల పై దా-డితో పాటుగా, రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న ప్రభుత్వ వైఖరిని తమ ఫిర్యాదులో తెలిపారు. అమిత్ షా తో భేటీ అయిన తరువాత, ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యాం అని, ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు చెప్పాం అని చెప్పారు. కొన్ని వీడియోలు స్వయంగా అమిత్ షా కు చూపించినట్టు చెప్పారు.

ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న బలవంతపు మత మార్పిడుల పై ఫిర్యాదు చేసాం అని, పాస్టర్ ప్రవీణ్ కు సంబందించిన వీడియో చూసి, అమిత్ షా షాక్ అయ్యారని, దీని పై మరిన్ని వివరాలు కావాలని కోరారని, ఆ వివరాలు ఇస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళమని అన్నారు. కోర్టుల పై వివిధ సందర్భాల్లో వైసిపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా ఆయనకు ఇచ్చామని అన్నారు. అలాగే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను టార్గెట్ చేసిన విధానం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా అమిత్ షా కు ఇచ్చామని ఎంపీలు తెలిపారు.

అయితే ఈ రోజు జరిగిన భేటీలో, అమిత్ షా కు సారైన సమాచారం లేదని అర్ధమైందని, జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని తప్పు దోవ పట్టించారని, వివరాలు అన్నీ చూసి, ఆధారాలు చూసి, అమిత్ షా స్పందించిన తీరుతో ఇది అర్ధం అయ్యిందని అన్నారు. అమిత్ షా కూడా కొన్ని సంఘటనల మీద, మరిన్ని వివరాలు, ఆధారాలు ఇవ్వమని అడిగారని, అవన్నీ ఆయన ఆఫీస్ కు ఇస్తామని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు.