చిత్తడినేలల అనే పదం విన్న వారే చాలా తక్కువ

415

పర్యావరణాన్ని కాపాడాలంటే చిత్తడినేలల సంరక్షణ ఎంతో ముఖ్యమని  అటవీశాఖ రాష్ట్ర ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి ఎన్. ప్రతీప్ కుమార్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం (world wetlands day..Feb2) సందర్భంగా మంగళవారం అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా  పాల్గొని మాట్లాడారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చిత్తడినేలల అనే పదం విన్న వారే చాలా తక్కువ మంది ఉన్నారన్నారు. దాని ఫలితంగానే చిత్తడినేలలు అతివేగంగా  అంతరించిపోతున్నాయన్నారు. చిత్తడి నేలలు భౌగోళిక పరంగా…జీవ వైవిధ్య పరంగా ఎంతో కీలక మైనవని అన్నారు. సముద్ర తీర ప్రాంతాలలో అయినా  .నదుల ప్రాంతాలలో  అయినా సంవత్సరం లో  అధిక కాలం నీరు నిలువ ఉండి లోతు  తక్కువగా  ఉండే  ప్రదేశాలను చిత్తడి నేలలుగా  పిలుస్తారు అని  వివరించారు.

మంచినీటి. ఉప్పు నీటి  సరస్సులు మడ అడవులు కలిగిన సాగర సంగమ ప్రాంతాలు.బురద కొయ్యలు. ఉప్పు నీటి కొయ్యలు. ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు వంటివన్నీ  చిత్తడి నేలలు కిందకే వస్తాయని ఆయన  వివరించారు. ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థలో చిత్తడి నేలలు కీలక పాత్ర  వహిస్తాయన్నారు.సముద్ర తీరం లో  చిత్తడి నేలలు ఆ ప్రదేశానికి స్థిరత్వాన్ని  ఇవ్వడమే కాకుండా అలల తాకిడికి ఆ ప్రాంతం దెబ్బ తినకుండా  రక్షిస్తాయన్నారు.

నదుల ప్రాంతంలో అయితే చిత్తడి నేలలు వరద ముంపుల నుండి  రక్షించడమే కాకుండా వందల రకాల మొక్కలు. జంతువులకు  మెరుగైన  ఆశ్రయాన్ని ఇస్తాయని తెలిపారు. తొలిసారిగా 1971 ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరపారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే చిత్తడినేలల సం రక్షణ ఎంతో అవసరమన్నారు.

 ఈ కార్యక్రమంలో  సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ రాహుల్ పాండే. సిసిఎఫ్ తిరుపతి శరవణన్. రాజమండ్రి డీసీఎఫ్ సీ.సెల్వం. ఎక్స్ పాలసీ అడ్వైజర్ గ్లోబల్  ప్రెష్ వాటర్ అండ్ వెబ్ ల్యాండ్స్ డాక్టర్  భిక్షం గుజ్జా. సాకాన్  సీనియర్  సైంటిస్ట్ డాక్టర్ గోల్డెన్  క్వాద్రోస్. డబ్ల్యూ ఎఫ్ఎఫ్ కు చెందిన  సురేష్ బాబు  తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా wetland పోస్టర్ను ఎన్. ప్రతీప్ కుమార్ ఆవిష్కరించారు.