విజయవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు
పారిశుధ్యంపై శ్రద్ద వహించండి…
నగర పాలక సంస్థ అధికారులతో దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పర్యటన.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విజయవాడ అభివృద్ధి కుంటు పడిందని, గత ఎంపీ ఎమ్మెల్యే లు ఎవరు విజయవాడని పట్టించుకోలేదని, నగర అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫండ్స్ రూ.500 కోట్లులను ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చిన నిధులతో అభివృద్ధి జరుగుతుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగర పాలక సంస్థ అధికారులతో కలిసి మంగళవారం నగరంలో వివిధ ప్రాంతాలు పర్యటించారు.
మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు.దేవాలయాల దాడుల విషయం లో ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 40 దేవాలయాలు కూల్చివేసిన ఘనత చంద్రబాబు దన్నారు. ఆ దేవలయాలని పునర్నిర్మాణం చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో 42వ డివిజన్ భవానీపురం శివాలంయ సెంటర్ నుంచి పర్యటన ప్రారంభించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్ కాలనీ రహదారుల నిర్మాణం పరిశీలించారు. రైతు బజార్ పోలీస్ కాలనీలోను మరియు శ్రావణ్ వీధిలో సిసి రోడ్డు నిర్మాణం అంచనాలు సిద్దం చేయాలని అధికారులను అదేశించారు. అదే విధంగా రైతు బజార్లో రహదారి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించడానికి టౌన్ ప్లానింగ్ డిపార్టమెంట్ వాళ్లు ప్రయివేట్ వ్యక్తులుతో సంప్రదింపులు జరిపి పరిష్కారించించాలన్నారు. హౌసింగ్ బొర్డు కాలనీలో ఉన్న ఎస్టిపి పార్కు ప్రహారీ గొడ ఎత్తు పెంచాలని. రాత్రి వెళ పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కాపలా ఏర్పాటు చేయాలన్నారు.చెత్తా చెదారం తొలగించాలన్నారు. నగరంలో పారిశుధ్యంపై శ్రద్ద వహించాలన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పర్యటనలో నగర పాలక సంస్థ అధికారులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.