జగన్‌ ప్రధాని అయినా ప్రత్యేక హోదా అసాధ్యం:సుజనాచౌదరి

360

అమరావతి: జగన్‌ ప్రధాని అయినా ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తేల్చి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ జగన్‌ ఢిల్లీ వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. జగన్‌ కేసులు ఉపసంహరణకు చేసే ప్రయత్నం.. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేయడం లేదు. ఎన్నికల బడ్జెట్ అని వైసీపీ అనడం విడ్డూరం. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించారో చెప్పాలి. పోలవరానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. అప్పుడు చంద్రబాబును ప్రధాని చేసినా ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమయ్యేది. ప్రత్యేక ప్యాకేజీలో మంజూరు చేసిన 20 వేల కోట్లను కూడా తెచ్చుకోవడం రాష్ట్ర నేతలకు సాధ్యం కావట్లేదు.’’ అని అన్నారు.