పట్టాభిపై ప్రభుత్వ దాడి…!

556

టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ శర్మ ధ్వజం

కమలాపురం, (ఫిబ్రవరి 2):  తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి  పట్టాభి పై దాడి ముమ్మాటికీ ప్రభుత్వ దాడేనని, ఈ చర్య తీవ్ర అమానుషమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయి నాథ్ శర్మ అన్నారు.  కమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రభుత్వ వ్యతిరేక విధానాలను డిబేట్ ల ద్వార ఎండగడుతున్న పట్టాభి పై అధికార పార్టీ నాయకులు కక్ష పెట్టుకొని  దాడి చేయడం శోచనీయమన్నారు. పట్టాభి పై జరిగిన దాడిని చూస్తుంటే అధికార పార్టీ ఎంతటి పీరికిచర్యలకు పాల్పడుతోందో తెలుస్తోందన్నారు. ప్రజా వ్యతిరేకతో ఆత్మరక్షణలో పడిన అధికార పార్టీ ఏం చేయాలో దిక్కు తెలియక ఇలా తెలుగుదేశం పార్టీ నాయకుల పై దాడికి పూనుకుందని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని అధికార పార్టీ దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఒక పట్టాభి పై దాడి చేస్తే వంద మంది పట్టాభిలు పుట్టుకువస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అరాచక విధానాల వల్ల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని దీనిని జీర్ణించుకోలేని  అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులను దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నిస్థుoడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ పార్టీ అధికారం శాశ్వతం అనుకుంటోందని , జీవితకాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని వారు భ్రమ పడుతున్నారన్నారు . రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడం అధికార పార్టీకి ఫ్యాషన్ గా మారిందన్నారు  ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తమకు అర్థం అవుతోoదన్నారు పట్టాభిపై జరిగిన దాడి ముమ్మాటికీ ప్రభుత్వ దాడి అని ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు.