టిడిపి నాయకుల హౌస్ అరెస్ట్ లను ఖండించిన చంద్రబాబు

212

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో టిడిపి నాయకుల హవుస్ అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు.
పంచాయితీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసిపి ఉన్మాద చర్యలు..ఓడిపోతామనే భయంతోనే వైసిపి కుట్ర రాజకీయాలు..
నిన్నటిదాకా నామినేషన్లు వేయకుండా అడ్డంకులు, బలవంతపు ఏకగ్రీవాలకు వైసిపి కుట్రలు. వాటిని ప్రజలే తిప్పికొట్టడంతో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరింది.
నామినేషన్లు వేశారన్న అక్కసు భరించలేకే ఇప్పుడీ అక్రమ నిర్బంధకాండ. టిడిపి నేతల హవుస్ అరెస్ట్ లను అందరూ ఖండించాలి. వైసిపి ఉన్మాద చర్యలను ప్రతిఒక్కరూ గర్హించాలి.
ఎన్నికల ప్రక్రియ నుంచి టిడిపి శ్రేణుల దృష్టి మళ్లించేందుకే వైసిపి కుట్ర రాజకీయాలు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు, టిడిపి నాయకుల గృహ నిర్బంధాలు.
టిడిపి నాయకులు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలి.
పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. 2వ దశ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో నామినేషన్లు వేయాలి.
బెదిరించి, బలవంతపు ఏకగ్రీవాలు చేయాలనే వైసిపి కుట్రలను భగ్నం చేయాలి.
తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, హవుస్ అరెస్ట్ లతో టిడిపిని అణిచేయడం వైసిపి వల్ల కాదు. ప్రజల్లో ఆదరణ ఉన్నంతకాలం టిడిపిని ఎవరేం చేయలేరు.
వైసిపికి పోగాలం దాపురించింది. అందుకే ఈవిధంగా అరాచకాలకు తెగించింది. హత్యలు, ఆత్మహత్యలు, హింసా విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసింది. బిసి,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండకు పాల్పడుతోంది.
బాధితులంతా ఏకమై తిరగబడితే వైసిపి భూస్థాపితం ఖాయం. బంగాళాఖాతంలో వైసిపిని కలిపేయడం తథ్యం. బడుగు బలహీన వర్గాల ప్రజలే వైసిపికి తగిన బుద్ది చెప్పాలి.
టిడిపి నాయకులను బేషరతుగా విడుదల చేయాలి. తప్పుడు కేసులను తక్షణమే ఎత్తేయాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.