టిడిపి నాయకుడు పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

212

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడిని తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. 15మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం, పట్టాభిని గాయపర్చడంపై చంద్రబాబు మండిపడ్డారు.
‘‘విజయవాడలో పట్టపగలు పట్టాభిపై దాడి చేయడం వైసిపి గుండారాజ్ కు ప్రత్యక్ష సాక్ష్యం. సిఎం జగన్ రెడ్డి అండతోనే వైసిపి గుండాలు రెచ్చిపోతున్నారు. ఇంటినుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న పట్టాభిపై దాడి గర్హనీయం. సెల్ ఫోన్ తో సహా పట్టాభి కారును ధ్వంసం చేయడం హేయం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి పట్టాభిపై దాడి మరో సాక్ష్యం.
గతంలో పట్టాభి కారు ధ్వంసం చేసినవాళ్లపై చర్యలు లేవు. పోలీసుల ఉదాసీనతతో వైసిపి గుండాల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. పట్టాభిపై దాడిచేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. పట్టాభికి పూర్తి భద్రత కల్పించాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.