ఒక ఉత్తమ బడ్జెట్ !

362

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! దాని మీద చిన్న విశ్లేషణ :

కేంద్రానికి పైసలు వస్తున్న తీరు-ఖర్చు అవుతున్న తీరు స్థూలంగా …

కేంద్రానికి ప్రతీ రూపాయి ఆదాయం ఈ విధంగా వస్తోంది :

1. రుణాలు లేక ఆప్పులు వంటివి     36 పైసలు
2. GST ద్వారా ఆదాయం                15
3. ఇన్కమ్ టాక్స్                             14
4. కార్పొరేట్ లేదా కంపెనీల టాక్స్     13
5. కేంద్ర ఎక్సయిజ్ పన్నులు                8
6. ఇతర పన్నేతర ఆదాయం              6
7. అప్పులేని స్థిరాస్తి లాభాలు             5
8. కష్టమ్స్ డ్యూటీ                             3
=======
మొత్తం          100
========

కేంద్రానికి ప్రతీ రూపాయిలో ఖర్చు ఈ విధంగా ఉంది :

1. అప్పులపై వడ్డీలు                          20 పైసలు
2. కేంద్ర పనుల్లో రాష్ట్రాల వాటా         16
3. కేంద్ర సంక్షేమ పథకాలు                  14
4. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకి 10
5. సాధారణ ఖర్చులు                        10
6. రాష్ట్రాల ద్వారా కేంద్ర పధకాలకు      9
10. వివిధ సబ్సిడీలకు                         8
11. డెఫిన్స్ ఖర్చు                                8
12. పెన్షన్లు ఖర్చు                                5
========
మొత్తము            100
========
2000వ సంవత్సరం వరకు కేంద్ర ఇన్కమ్ టాక్స్, కొన్ని వస్తువుల మీద కేంద్రం వసూలు చేసే ఎక్స్సైజ్ లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఇచ్చేవారు.   2000 సం. లో వాజపేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ రెండు కేంద్ర పన్నుల మీదే కాక కేంద్రం వసూలు చేస్తున్న అన్ని రకాల పన్నుల్లో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి అని నిర్ణయించారు. అలాగే 2014 సం. వరకు కేంద్ర నుండి రాష్ట్రాలకు వెళ్లే నిధులు మొత్తంగా 32% మించకుండా వెళ్ళేవి.

మోడీ ప్రధాని అయ్యాక 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ప్రకారం ఈ మొత్తాన్ని 42% వరకు పెంచారు. రాబోయే సం. ఆదాయం, వ్యయాల అంచనాయే బడ్జెట్.
ఈ సం. కోవిడ్ కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు బాగా తక్కువ జరగడంతో గత సం.బడ్జెట్ లో అనుకున్న విధంగా కేంద్రానికి ఆదాయాలు రాలేదు..పై పెచ్చు కోవిడ్ కారణంగా ముందు ఊహించని కొత్త ఖర్చులు అంటే కోవిడ్ అరికట్టడానికి చర్యలు, ఆరోగ్య ఇన్ఫ్రా మీద ఖర్చులు, బీద వారికి 6 నెలలు ఉచిత రేషన్, మూడు నెలల ఉచిత గాస్ ఇలా ముందుగా ఊహించని చాలా ఖర్చులు పెరిగాయి.

పుండు మీద కారంలా లాడఖ్ వద్ద గత 10 నెలలుగా చైనా బోర్డర్డ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో సుమారు 50 వేల మంది సైనికులను అక్కడ మోహరించారు. ఆయుధాలు అవి కొనడానికి, తరలించడానికి ఆ చలిప్రదేశంలో సైనికుల అవసరాలు తీర్చడానికి మొదలగు ఖర్చులకు కేంద్రం ఇప్పటి వరకు 25 వేల కోట్లు ఖర్చు చేసింది. అలాగే ఈ సం. ప్రజలందరికీ ఉచిత కరోనా వాక్సిన్ ఇవ్వడానికి ₹35,000 కోట్లు కేటాయించారు.

ఒక పక్క ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగినా నిర్మలా సీతారామన్ ప్రజలపై పన్నులు భారం వేయకుండా ఆర్ధిక వ్యవస్థలో కార్యకలాపాలు పెంచి వాటి ద్వారా పన్ను రాబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇంత గొప్ప బడ్జెట్ తీసుకురావడానికి ఆర్ధిక శాఖ చాలా కష్టపడి కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో ప్రవేశబెట్టబడిన ఈ బడ్జెట్ ఒక ఉత్తమ బడ్జెట్ గా చరిత్రలో నిలిచిపోతుంది.

                                                                                                             – చాడా శాస్త్రి..