ఎలక్షన్ కోడ్ అంటే…?

263

ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా … ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ దీని మీద సుప్రీం కోర్ట్ కి తప్ప వేరే ఏ ఇతర సంస్థ కి పెత్తనం చలయించే అధికారం లేదు  ex (గవరన్మెంట్, పోలీస్,రాజకీయ నాయకులు) అంటే ఎలక్షన్లు ఎలా నిర్వహించాలి ఏ ఏ నియమాలు రాజకీయ పార్టీలు, క్యాండిడేట్లు, పాటించాలి ఎక్కడ ప్రచారం చేయొచ్చు, చేయొద్దు, ఎలక్షన్ల సమయంలో శాంతి భద్రతలు, నియమాలు మొత్తం అధికారం ECI చేతి లో ఉంటుంది ARTICLE 324 1949 ప్రకారం కొన్ని ముఖ్యమైన రూల్స్.

1.ఏ రాజకీయ పార్టీ, క్యాండిడేట్ కానీ కుల,మత,వర్గ,జాతిని ప్రభావితం చేసేలా గుడి, మసీదు, చర్చి ఇతర ఆధ్యాత్మిక ప్రదేశంలో ఎలక్షన్ ప్రచారం, క్యాంపెయినింగ్ చేయరాదు.
2. ఏ రాజకీయ పార్టీ కానీ, క్యాండిడేట్ కానీ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుల,మత,వర్గ,జాతిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదు.
3.పొలిటికల్ పార్టీస్ కి ప్రతిపక్షన్నీ వాటి పాలిసలనీ, విధి విధాలని విమర్శించే హక్కు ఉంది కాని వాళ్ల పర్సనల్ విషయాలు అయిన కుటుంబ, వ్యక్తిగత విషయాలను గురుంచి మాట్లాడే హక్కు లేదు.
4. నాకే లేదా మా పార్టీకే వోట్ వేయమని బేదీరించడం డబ్బులు ఇచ్చి మకే వోట్ వేయాలి అనడం, లంచాలు ఇవ్వడం, ఎలక్షన్ జరుగుతున్న ప్రదేశం నుండి 100 మీటర్ల లోపు ఓటర్లను ప్రభావితం చేసేలా చర్యలను చేయరాదు.
5. రాజకీయ పార్టీస్కీ సంబందించిన పోస్టర్లు, జెండాలు, ఫొటోలు, ఫ్లెక్సీలు ఇతర వస్తువులు యజమాని అంగీకారం  లేకుండా వాళ్ళ ఇళ్ల మీద అతికించరాదు.
6. ఒక రాజకీయ పార్టీకి సంబందించిన వ్యక్తులు వేరే రాజకీయ పార్టీకి సంబందించిన మీటింగ్ల ను అడ్డుకోవడం అక్కడ వాళ్ల పార్టీకి సంబందించిన సామగ్రి పంచడం ప్రచారం చేయరాదు.
7. పోలీస్ వారూ మరియు సంబంధిత అధికారుల నుండి  ముందస్తు సమాచారం, అనుమతి తీసుకోకుండా పార్టీ మీటింగ్ పెట్టారదు ఎందుకంటే ట్రాఫిక్కి మరియు జనాలకు అంతరాయం కాకుండా పోలీస్ వారికి ముందే చెపితే వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తారు.
8. రాజకీయ పార్టీలు, క్యాండిడేట్ లు ప్రజా యాత్రలు జనాల నడుమ వెళ్లి ప్రచారం చేయాలనుకుంటే పోలీస్ వారు, సంబంధిత అధికారులా దగ్గర నుండి అనుమతి తీసుకోవాలి ఎక్కడ ఏ ప్రదేశం ఎప్పుడు ప్రారంభం, ముగిస్తుందో అన్ని వివరాలు చెప్పి అనుమతి తీసుకోవాలి.
9. ప్రజలకు ఇచ్చే ఓటర్ స్లిప్ మీద ఏలాంటి రాజకీయ పార్టీకి, క్యాండిడేట్ సంబంధించిన గుర్తులు మొదలు అయినవి ఉండరాదు