ఇది చారిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్

278

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌ సభలో ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్‌ ను బీజెపీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తోంది.  దేశ ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని,పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలే బడ్జెట్ ఉంది.

అదనంగా మరో కోటి మందికి మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వరా పొగచూరిన మహిళల జీవితాలలో వెలుగులు నింపిన బడ్జెట్.  కరోనాతో నెమ్మదించిన దశ ఆర్ధిక వ్యవస్థకు మళ్లీ ఉరుకులు పెట్టించే బడ్జెట్ కరోనా తర్వాత ప్రజల్లో భారత ప్రగతిపై విశ్వాసం పెంచేలా ఈ బడ్జెట్ నురూపొందించారు కరోనా నేర్పిన పాఠంతో… ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.

కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్ధిక వ్యస్థ అతలాకుతమవుతున్న తరుణంలో భారత దేశం అభివృద్ది దిశగా ముందడుగు వేయడం శుభసూచకం. అభివృద్ది చెందిన దేశాలో సైతం ఆర్ధిక పరిస్థితి కుదేలై కొనుగోలు శక్తి పడిపోయిని  ఈ పరిస్థితులో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా అర్ధిక వ్యవస్థను గాడిలోకి రావడం గౌరవ ప్రధాని నరేంద్రమోది తీసుకున్న నిర్ణయాలతోనే సాధ్యం అయింది.

అభివృద్దిని,సంక్షేమాన్ని ఈబడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ గారు సమతూకంలో ఉంచేందుకు చేసిన ప్రయత్నం అబినందనీయం. మౌళిక రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడం ద్వారా అన్ని రంగాలు దీర్ఘకాలిక అభివృద్ది దిశగా పయనిస్తాయి.మొట్ట మెదటి సారిగా బడ్జెట్‌ను ఆరు భాగాలుగా విభజించి ప్రతీ రంగానికి ప్రత్యేక నిధులు మరియు విధానపర నిర్ణయాలు ప్రకటించడం ద్వారా 2021-22లో భారత ఆర్ధిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో సందేహం లేదు.

జీడీపీలో ద్రవ్యలోటును 6.5%నికి నియంత్రించడం ద్వారా దేశ ఆర్ధికస్థితి మెరుగవడం ఖాయం. ఆత్మనిర్భర ప్యాకేజీకి రూ.27.17లక్ష కోట్లు కేటాయించడంతో వైద్య, విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలో అభివృద్ది సూచీ ఖచ్చితంగా కనపడుతుంది.

ఆర్ధికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం చుదువుతున్నంతసేపు స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోవడం భారీ లాభాలు నమోదు కావడం దేశాన్ని ఈబడ్జెట్‌ అన్ని రంగాల్లో అభివృద్దిపథం వైపు తీసుకెళుతుందనేందుకు నిదర్శనం.

కరోనా అనంతరం ప్రజల ఆరోగ్యం మీద మోది ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజారోగ్యానికి రూ.2,23,846 కోట్లు కేటాయించడం భారత చరిత్రలోనే తొలిసారి, పీఎం ఆత్మ నిర్భర్  స్వస్థ్ యోజన కింద.64,180 కోట్లు, వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు కేటాయించడం, జాతీయ స్థాయిలో 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక చర్యలను ఈ బడ్జెట్లో ప్రకంటిచడం,100 దేశాలకు మనం వ్యాక్సిన్‌ సరఫరా చేయడం మన ప్రధాని నరేంద్రమోది గారి దార్శనికతతోనే సాధ్యం అయింది.ఒకే దేశం`ఒకే కార్డు అమలుతో వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే వెసులు బాటుకలుగుతుంది.

ఈ బడ్జెట్‌ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కనీస మద్దధర కోసం రూ 1లక్షా72 వేల కోట్లు కేటాయించారు. కనీస మద్దతు ధర ఎత్తేస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు మద్దతు ధర పెరిగేలా పాలసీని రూపొందించడం జరిగింది. కనీస మద్దతు ధర ద్వారా గత ఆరేళ్లలో జరిగికొనుగోళ్లను చూస్తే  అర్థమవుతుంది వరి కొనుగోళ్లు 2013-14లో మద్దతు ధర ద్వారా రూ.63,928 కోట్లు కాగా 2020-21(ఇప్పటి వరకు అందిన సమాచాం మేరకు)లో రూ.1,72,752 కోట్లు.

మేక్‌ ఇన్‌ ఇండియా ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌ లో ప్రత్యేక శ్రద్దతీసుకోవడం వలన  స్థానికంగా తయారీ రంగానికి ఊతం అభిస్తుంది దీంతో ఉద్యోగ ఉపాధి గణనీయంగా పెరగడం ఖాయం.యువతను ప్రోత్సహించడానికి స్టార్ట్‌అప్‌లకు చేయూతనివ్వడం హర్షణీయం.

గృహరుణాలపై వడ్డీ రాయితీ మరో ఏడాది పొడగించడంతో నిర్మాణ రంగం ఊపందుకోవడం ఖాయం.
తెలంగాణ విషయానికి వస్తే… రాష్ట్రం అంచనాలకంటే భారీగానే కేంద్రం కేటాయింపులు ఉన్నాయి కరోనా మహమ్మారి తరువాత దేశ ఆర్ధిక స్థితిని గాడిలో పెట్టడం కత్తి మీద సాములాంటిది. ఈ పరిస్థితిలో ద్రవ్యలోటును తగ్గిస్తూ జీడీపీ గ్రోత్‌ రేటు పెంచేందుకు ఆర్ధిక మంత్రినిర్మలా సీతారామన్‌ గారు చేసిన ప్రయత్నం భినందనీయం.

ప్రియతమ ప్రధాని నరేంద్రమోది  ‘‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’’ ను ఈ బడ్జెట్‌ సాకారం చేస్తుంది.