అరాచకాలు చేస్తూ టీడీపీ నిందలు: మంత్రి అనిల్‌

431

నెల్లూరు, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వాళ్లే అరాచకాలు చేస్తూ నిందలు తమపై వేయడం సిగ్గుచేటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీనే అడ్డదారులు తొక్కుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయానా టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.

మూన్నాళ్లు వుండే ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారని, పల్లెలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదని మంత్రి అనిల్ ఆరోపించారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం పైగా గెలుపు వైయ‌స్ఆర్‌సీపీదేనని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.