మధ్యతరగతికి తీపికబురు…

297
Finance Minister Nirmala Sitharaman

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సామన్యులకు శుభవార్త‌ చెప్పారు. దారిద్ర్యరేఖకు దిగువను ఉండేవారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టులు సైతం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పైలెట్‌ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు రావడంతో వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌‌ కార్డు విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే లబ్దిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ పథకం వల్ల లబ్దిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాళ్లైనా మరే… ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.