వాహనాలపై ప్రత్యేక పాలసీ ప్రకటించిన నిర్మలా సీతారామన్‌

532

మూడవ సారి దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. దానిలో భాగంగానే ఈ సారి బడ్జెట్‌లో నూతన వాహన పాలసీని ప్రకటించారు నిర్మలా సీతారామన్‌. గడువు ముగిసిన వాహనాల కోసం ఈ ప్రత్యేక పాలసీని ప్రకటించారు. గడువు ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా పక్కన పెట్టేలా పాలసీ రూపొందించారు. 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కులా మార్చే ఈ పథకాన్ని రూపొందించారు.  వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలకు 15 ఏళ్లుగా గడువు నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి విరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్యం నివారణకు రూ. 2217 కోట్లు కేటాయించారు కేంద్రమంత్రి.