విరూష్క కూతురుకి నామకరణం..

2144

భారత క్రికెట్ టీమ్ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ తల్లిదండ్రులయిన విషయం తెలిసిందే. అనుష్క ఈ ఏడాది జనవరి11న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని విరాట్ ఆ రోజే అభిమానులతో పంచుకున్నారు.ప్రపంచంలో పాపులర్ కపుల్‌గా గుర్తింపు పొందిన వీరుష్క తమ కూతురుకి ‘వామిక’గా నామకరణం చేశారు. బారసాల వేడుకలోని ఫోటోతో వీరుష్క తమ కూతురి మొదటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా ‘మేమిద్దరం ప్రేమ, గౌరవంతో కలిసి జీవించాం. మా కూతురు వామిక మా ప్రేమను మరో స్థాయికి చేర్చింది. బాధ, ఆనందం, కన్నీళ్లు, అన్నింటినీ కొన్నిసార్లు కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభూతి చెందుతా’మని వీరుష్క రాసుకొచ్చారు. ఈ ఫోటోలో అనుష్క కూతురుని ఎత్తుకొని ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వీరు షేర్ చేసిన వెంటనే అభిమానులు విష్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరుష్క షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)