బడ్జెట్‌పై మోడీ ప్రశంసలు..

377

ఇవాళ ఉదయం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.. కొందరు ఊరట కల్పిస్తూ.. మరికొందరిపై పన్నులు బాదుతూ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి.ఇక, ఈ బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.. బడ్జెట్‌పై ప్రత్యేకంగా జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతులకు పెద్ద పీట వేశారని తెలిపారు.

భారత దృఢ సంకల్పాన్ని, ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రపంచానికి చాటుతోందని తెలిపారు ప్రధాని మోడీ.స్వయంసమృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవర్చేలా కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్, ఆమె బృందం తీర్చిదిద్ది ప్రవేశపెట్టారని ప్రశంసించారు . బడ్జెట్ వృద్ధికి ఊతమిస్తోందని.. యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆదాయం, వెల్ నెస్ మరింత పెరుగుతోందని చెప్పారు ప్రధాని.అన్నీ రంగాల్లో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పుకొచ్చిన ఆయన…రైతుల ఆదాయం పెంచేందుకు చక్కగా ప్రణాళికలు రచించారని కొనియాడారు. పల్లెల్లో గల రైతుల హృదయం నుంచి ఈ బడ్జెట్ పుట్టుకొచ్చిందని అభివర్ణించారు ప్రధాని మోడీ.అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ సహాయంతో ఏపీఎంసీ మార్కెట్లు పటిష్టమవుతాయని అన్నారు.యువతకు కొత్త అవకాశాల కల్పనతో పాటు మానవ వనరులు, మౌలిక వసతుల వృద్ధితో సాంకేతకపరంగా పురోగమించడానికి బడ్జెట్‌ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు మోడీ.