జైలుకు పంపడం వెనుక కేటీఆర్, దయాకర్ రావుల ప్రోధ్బలం

257

నిన్నటి రోజు వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనలకు బాధ్యులనే నెపంతో 38మంది బాజాపా నాయకులు,కార్యకర్తలను అరెస్టుచేసి జైలుకు పంపడాన్ని రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,  పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు  పరకాల శాసన సభ్యుడు తెరసా నాయకుడు ధర్మారెడ్డి రామజన్మభూమి ట్రస్టు కార్యక్రమాలపై చేసిన ప్రకటనకు నిరసనగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారన్న నెపంతో బీజెపి నాయకులను అరెస్టుచేయడం తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని జరిగిందని భావించాల్సి వస్తుంది  అన్నారు.

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తనగుండాలతో బీజెపి కార్యకర్తల మీద దాడి చేయడం, తరువాత పోలీసు ష్టేషన్లో బీజెపి నాయకుల కార్లను ధ్వంసం చేయడం అదికూడా పోలీసుల సమక్షంలో జరగడం ఒక దుర్మార్గమైన చర్య. నిన్న రాత్రి బిజెపి నాయకులు డాక్టర్ విజయచంద్రా రెడ్డి ఇంటి కాంపౌండ్ వాల్ ని జేసీబీలతో కూల గొట్టించడం రాజకీయ పిరికిపందల లక్షణమని బావిస్తున్నాను. ఈ మోత్తం ఘటన వెనుక  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, తెరాసరాష్ట్ర కార్యకనిర్వాహక అధ్యక్షుడి సూచనల మేరకే జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రమంత్రిగా కేటీఆర్చేసిన వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్నాయి  అన్నారు.

మంత్రి అయిఉండి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని బిజెపి రాష్ట్రశాఖ ప్రశ్నిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామజన్మభూమి ట్రస్టుకు చెందిన కార్యకర్తలమీద పోలీసులు లాఠీచార్జి చేయడం వారిమీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అందులో బీజెపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మతో పాటు మరోఐదుగురు మహిళా నాయకులను జైలుకు పంపడం వెనుక కేటీఆర్, దయాకర్ రావుల ప్రోధ్బలం ఉంది. వరంగల్ జిల్లా పోలీసులు  శాంతి భద్రతలను రక్షించాల్పింది పోయి తెరాసా నాయకుల ఆదేశాలను పాటించడం వారికి తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మఛ్చ. అయోధ్య రామాలయ నిర్మాణం అంశం పైన, నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న విషయం మీద ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునిఇప్పటికైనా చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలకుబహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే రామదండు నిరసన కార్యక్రమాలను  కొనసాగిస్తుంది.తెరాసా ఎమ్మెల్యేలు, మంత్రులు అయోధ్యలోరామాలయ నిర్మాణంపై చేస్తున్న ప్రకటనలపట్ల ముఖ్యమంత్రి స్పందించాలని బీజెపీ డిమాండ్ చేస్తున్నది  అన్నారు.