భారతీయులకల భవ్య రామమందిర నిర్మాణo:కన్నా

382

కోటానుకోట్ల భారతీయులకల భవ్య రామమందిర నిర్మాణo. అలాంటి కలను తీర్చుకోబోతున్నామని  మాజీమంత్రి   కన్నా లక్ష్మీనారాయణ  అన్నారు. చిన్నలు పెద్దలు కూలీలు ముసలి తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా రామనిధి సమకూర్చడం సంతోషం కలుగుతుంది. నాలుగు లక్షల మంది రామమందిరం కోసం త్యాగాలు చేసారని గుర్తు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్రంలో రామమందిరనిర్మాణమే ద్యేయంగా సేవకులు పనిచేస్తున్నారని అన్నారు.ప్రతి హిందూ బంధువు వారి శక్తిమేరా పాలుపంచుకోవాలని సూచించారు. ఈసదవకాశం ఈతరం వారికి దక్కడం ముదావహమన్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణలో భాగంగా ఈరోజు బ్రాడీపేటలో శ్రీరామసేవకులు దేచిరాజు సత్యంబాబు ఆధ్వర్యంలో బ్రాడీపేట 2,3,4 లైన్లనుండి మెయిన్ రోడ్ రాములవారి గుడివరకు శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ సేవకులుతో,బీజేపీ కార్యకర్తలతో,RSS నేతలతో కోలాట బజనలతో,శ్రీరాముడు హనుమంతుని వేషధారణలతో జైశ్రీరామ్ నినాదాలతో శోభాయమానంగా జరిగింది. ఈశోభాయాత్రకు ముఖ్య అతిథులుగా మాజీమంత్రి  రావెల  కిషోర్ బాబు,బీజేపీ జిల్లాఅధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ,Rss పెద్దలు Dr నాగార్జున,చలువాది వెంకటేశ్వర్లు,అమ్మిశెట్టి ఆంజనేయులు,లక్ష్మీపతి,తాళ్ల వెంకటేష్ యాదవ్,పాల్గొన్నారు.